మోడీ, షా మధ్య విబేధాలున్నాయా - చత్తీస్ ఘడ్ సీఎం

Submitted on 19 January 2020
Bhupesh Baghel Hints at Rift Between PM Modi and Amit Shah

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా మధ్య విబేధాలున్నాయా ? అని ప్రశ్నించారు ఛత్తీస్ గడ్ సీఎం భూపేశ్ బాగెల్. CAA, NRCలపై విమర్శలు గుప్పించారు. రెండింటి మధ్య విబేధాలున్నాయని, ఇది దేశాన్ని దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించారు. CAA, NPR, NRC చట్టాలు కాలక్రమంలో భాగమని, NRC అమలు చేయబోమని పీఎం మోడీ..వీరిద్దరిలో ఎవరు అబద్దాలు చెబుతున్నారు ? ఇద్దరు నాయకుల మధ్య విబేధాలున్నట్లు అనిపిస్తోందని..దీనికారణంగా దేశం బాధపడుతోందని అనడం చర్చనీయాంశమైంది. 

ఐదు సంవత్సరాల్లో నరేంద్ర మోడీ డీమానిటైజేషన్, జీఎస్టీని అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 7-8 నెలల్లో అమిత్ షా కూడా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆర్టికల్ 370 తొలగింపు, CAA, NPR చట్టాలను అమలు చేశారని తెలిపారు. 

పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NCR)లకు వ్యతిరేకంగా ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. JNUలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గుర్తు తెలియని దండగులు క్యాంపస్‌లోకి చొరబడి అధ్యాపకులను, విద్యార్థులను తీవ్రంగా గాయపరిచారు. దీంతో పరిస్థితి మరింత వేడెక్కింది.

Read More : తెలంగాణలో జనసేనను బలోపేతం చేస్తాం - పవన్

bhupesh baghel
Hints
Rift
PM Modi and Amit Shah
NRC and CAA
Chhattisgarh Chief Minister

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు