భీష్మ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Submitted on 20 June 2019
Bheeshma Regular Shoot Begins

నితిన్, రష్మిక జంటగా 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందనున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ భీష్మ (సింగిల్ ఫరెవర్).. రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. జెర్సీ తర్వాత పిడివి ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.

భీష్మ షూటింగ్ స్టార్ట్ అయిన సందర్భంగా నితిన్ సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని నెటిజన్స్‌తో షేర్ చేసుకున్నాడు. 'దాదాపు సంవత్సరం తర్వాత కెమెరా ముందుకొచ్చాను.. న్యూ డే, న్యూ లుక్, న్యూ క్యారెక్టర్, ఈ న్యూ జర్నీ పట్ల చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను.. భీష్మ షూటింగ్ బిగిన్స్'.. అని నితిన్ ట్వీట్ చేసాడు. 

లై, చల్ మోహన రంగా, శ్రీనివాస కళ్యాణం వంటి వరస ఫ్లాప్స్‌లో ఉన్న నితిన్‌.. భీష్మతో ట్రాక్‌లోకి వస్తాననే ధీమాతో ఉన్నాడు. నరేష్, సంపత్, రఘబాబు, బ్రహ్మాజీ, నర్రా శ్రీను, కళ్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : మహతి స్వరసాగర్, కెమెరా : సాయి శ్రీరామ్, ఆర్ట్ : సాహి సురేష్.

 

Nithin
Rashmika
Sithara Entertainments
Venky Kudumula

మరిన్ని వార్తలు