వేసవిలో ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Submitted on 22 May 2019
Best Summer Health Tips : Follow These Health Tips In Summer

కాలానికి అనుగుణంగా తీసుకునే ఆహారం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ సీజన్‌లో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ఎరుపు, ఆరంజ్, పసుపు రంగులలో ఉన్న గుమ్మడి, బంగాళదుంప, చిలగడదుంప, బీట్రూర్, కారెట్ లాంటివి తింటే మంచిది. వాటిలో విటమిన్ - A, విటమిన్ - C, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  ఎండలో ఇంటికి వచ్చినప్పుడు ఒక్క గ్లాసుడు నీరు తీసుకుంటే చాలు, శరీరం ఉత్తేజితమవుతుంది. మంచినీరు ఎక్కువగా తాగుతూంటే డీ హ్రైడ్రేషన్‌కు దూరంగా ఉండవచ్చు. సమ్మర్ లో మంచినీటికి మించినది లేదు.


పుచ్చకాయ: ఇందులో 80 శాతం కంటె ఎక్కువ నీరు ఉంటుంది. అందువల్ల ఇది దాహాన్ని తీర్చి, డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. 
గ్రిల్డ్ వెజిటబుల్స్: ఉల్లిపాయ, క్యారట్, బీన్స్, వెల్లుల్లి వంటి వాటిని ఎండలో నుంచి ఇంట్లోకి రాగానే తినాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఎండతో వచ్చే చర్మవ్యాధులనుంచి రక్షిస్తాయి.
సలాడ్స్: వేసవిలో కూరగాయలతో రకరకాల సలాడ్స్ తయారుచేసుకోవచ్చు. గ్రిల్డ్ వెజిటబుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పనీర్ సలాడ్స్ వంటివి చేసుకోవచ్చు. అంతేకాదు దోసకాయ వంటివాటితో చేసిన సూప్‌ను భోజనానికి ముందుగా తీసుకోవటం వల్ల ఆకలి పెరుగుతుంది. 

ఆలివ్‌ ఆయిల్‌ ఆరోగ్యానికి మంచిది. అంతేగాకా చాలా సులభంగా జీర్ణమవుతుంది. అందువల్ల వేసవికాలం వంటకాల్లో ఎక్కువగా ఆలివ్‌ ఆయిల్‌ ఉపయోగించడం మంచిది.

 వేపుళ్లు, కారం, మసాలాలను వీలైనంత వరకు తగ్గించాలి. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. వీలైనంత వరకు మాంసాహారాన్ని తీసుకోకపోవడం మంచిది. పీచు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.

Summer Health Tips
Follow These Tips In Summer
2019

మరిన్ని వార్తలు