ఫిల్మ్ ఫెస్టివల్.. తెలంగాణ పాటకు అంతర్జాతీయ అవార్డు

Submitted on 14 March 2019
Best Film Award For Theme Song Of Telangana Tourism In 2019

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చూసి ప్రపంచమంతా మురిసిపోతుంది. జపాన్ వరల్డ్స్ టూరిజం నిర్వహించిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీల్లో సాంస్కృతిక, పర్యాటక రంగం కింద తెలంగాణ థీమ్ సాంగ్‌ను ప్రదర్శించారు. ఇందెలో భాగంగా తెలంగాణ టూరిజం థీమ్ సాంగ్‌కు ఉత్తమ సినిమా అవార్డు వరించింది. 

ఈ సాంగ్ లో ఎంతో అందమైన జలపాతాలు, ఎతైన కొండలు, పచ్చని పొలాలు, బతుకమ్మ ఆటలతోనా తెలంగణ కొటి రత్నల వీణా అంటూ ఎంతో అందగా..అద్భుతంగా రాశారు. ఈ పాటను వింటుంటే మనసుకు మంచి అనుభూతి కలుగుతుంది.

ఈ పాట దూలం సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సాంగ్ చిత్రీకరణకు తెలంగాణ ప్రభుత్వం, పర్యాటక శాఖ మంత్రి, టూరిజం డిపార్ట్‌మెంట్ ఎంతో సహకారం అందించిందని, అంతర్జాతీయ అవార్డు రావడం గొప్పగా ఉందని దూలం సత్యనారాయణ పేర్కొన్నారు. 

Best Film Award
Theme Song Of Telangana
International Award

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు