సూపర్ మెషీన్ : శానిటరీ వేస్ట్ సమస్యకి యువతి అద్భుతమైన పరిష్కారం

Submitted on 4 May 2019
A Bengaluru woman’s machine may solve the issue of sanitary waste disposal in India

పర్యావరణ కాలుష్యం రోజురోజుకి పెరిగిపోతోంది. ప్లాస్టిక్, పరిశ్రమల నుంచి వచ్చే రసాయనాలు, వ్యర్థాలు.. పెద్ద సమస్యగా మారాయి. మానవాళికి, పర్యావరణానికి అనేక సమస్యలు వస్తున్నాయి.  దీనికి తోడు శానిటరీ వేస్ట్. పర్యావరణాకి మరో పెద్ద సమస్యగా మారింది. పీరియడ్స్ సమయంలో మహిళలు వాడే శానిటరీ ప్యాడ్స్ పర్యావరణానికి ముప్పుగా మారాయి. దేశంలో రోజురోజుకి శానిటరీ  వేస్ట్ వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. నాసిరకం శానిటరీ ప్యాడ్స్ భూమిలో కరగడానికి 800 ఏళ్లు పడుతుందని నివేదికలు చెబుతున్నాయి. పోనీ వాటిని కాల్చేద్దామా అంటే.. హానికరమైన,  విషపూరితమైన వాయువులు వాతావరణంలో కలుస్తాయి. దీంతో శానిటరీ వ్యర్థాలను నాశనం చేయడం ప్రభుత్వాలకు ఛాలెంజ్ గా మారింది.

ప్రస్తుతం మార్కెట్‌లో లభించే ప్యాడ్స్ తయారీలో చాలా వరకు ప్లాస్టిక్ కారకాలు ఎక్కువగా ఉన్నాయి. అవి భూమిలో కలిసిపోవడానికి వందల ఏళ్ల సమయం పట్టడం మరో బిగ్ ప్రాబ్లమ్. ఈ  సమస్యకి బెంగళూరుకి చెందిన యువతి అద్భుతమైన పరిష్కారం కనుగొంది. ఓ మెషీన్ ను రూపొందించింది. ఈ మెషీన్ తో శానిటరీ వేస్ట్ వ్యర్థాలను చాలా సులభంగా, పర్యావరణ హితంగా నాశనం  చేయొచ్చు. ఎకో ఫ్రెండ్లీ కావడం ఈ మెషీన్ ప్రత్యేకత. సాధారణంగా శానిటరీ ప్యాడ్ ని బర్న్ చెయ్యాలంటే.. 800 డిగ్రీ సెల్సియస్ తో 5 నిమిషాల పాటు వేడి చెయ్యాలి. అప్పుడు కానీ ప్యాడ్ కాలదు.

బెంగళూర్ కి చెందిన నిషా నజ్రే 2017లో ఈ మెషీన్ కనిపెట్టింది. జూసీ ఫెమ్ కేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని నిర్వహిస్తున్న నిషా.. శానిటరీ ప్యాడ్స్ వ్యర్థాల నిర్వహణ కోసం దీన్ని  రూపొందించింది. ఈ మెషీన్ ద్వారా చాలా వేగంగా, ఎలాంటి పర్యావరణ కాలుష్యం లేకుండా శానిటరీ ప్యాడ్స్ ను డిస్పోజ్ చేయొచ్చు. రెండేళ్ల తర్వాత దీనిపై ఆమె పేటెంట్ సాధించింది. కర్నాటక,  తెలంగాణ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది. ఆయా రాష్ట్రాల్లో ఈ మెషిన్లు బిగించేందుకు చూస్తోంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ యూనిట్లలో పెట్టుకోవాలని కోరుతోంది.  ఇప్పటికే తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఈ మెషిన్లను ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. కర్నాటకలో ఎన్నికలు ముగిశాక ప్రభుత్వంతో మాట్లాడి పెద్ద సంఖ్యలో వీటిని ఇన్ స్టాల్ చేసే  దిశగా నిషా చర్చలు జరుపుతోంది.

శానిటరీ వేస్ట్ డిస్పోజ్ మెషిన్ ప్రత్యేకతలు
* పొల్యూషన్ ఫ్రీ
* విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ వెలువడదు
* డైఆక్సిన్స్ వెలువడవు
* ఈ మెషిన్ లో హీట్ కాయిల్స్ ఉండవు
* ఇందులో 2 ఛాంబర్లు ఉంటాయి
* ఒక దాంట్లో మండిపోతాయి
* మరో దాంట్లో హానికారక, విషపూరిత వాయువులు, కెమికల్స్ ఫిల్టర్ అవుతాయి
* రెండు మోడళ్లు
* ఒక దాని ధర రూ.లక్ష 45వేలు
* మరో దాని ధర రూ.లక్ష 66వేలు
* మిషన్ల కెపాసిటీని బట్టి ధర
* గంటలో 200 శానిటరీ ప్యాడ్స్ బర్న్ చేయొచ్చు
* ఒక్కో ప్యాడ్ కి అయ్యే విద్యుత్ ఖర్చు 50పైసలు కన్నా తక్కువ
* 40 లీటర్ల నీరు అవసరం
* 6 నెలలకు ఒకసారి నీరు మార్చాలి
 
సాధారణంగా శానిటరీ వేస్ట్ ను బర్న్ చేసేందుకు హీట్ బాక్సులు వాడతారు. వాటి కారణంగా విష వాయువులు గాల్లో కలుస్తున్నాయి. దీంతో మరిన్ని సమస్యలు వస్తున్నాయి. నిషా కనిపెట్టిన మిషన్ తో ఆ సమస్య ఉండదు. వాతావరణంలో ఎలాంటి విష వాయువులు కలవవు. వాతావరణ కాలుష్యం అనేది జరగదు. నిషా అంతటితో ఆగిపోలేదు. ఇంకా చాలా ప్రయోగాలు చేస్తోంది. చిన్న పిల్లల శానిటరీ ప్యాడ్స్ వ్యర్థాలను డిస్పోజ్ చేసే మెషిన్లను తయారు చేసే పనిలో ఉంది.

Bengaluru woman
machine
SOLVE
sanitary waste disposal
india
Nisha nazre
patent
solid waste management units

మరిన్ని వార్తలు