బెంగాల్ లో అడుగుపెట్టొద్దు : రాహుల్ కు నో ఎంట్రీ అంటున్న మమత

Submitted on 13 April 2019
Bengal govt denies permission for Rahul's chopper to land

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హెలికాఫ్టర్ ల్యాండింగ్ కు బెంగాల్ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో చేసేది లేక ఆదివారం సిలిగురిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిన రాహుల్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, యూపీ సీఎం  యోగి ఆదిత్యనాథ్‌  వెస్ట్ బెంగాల్ పర్యటనల సందర్భంగా కూడా ఇలానే జరిగింది.వారి హెలికాఫ్టర్లు ల్యాండ్‌ అయ్యేందుకు అక్కడి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.దీంతో మమత సర్కార్ కావాలనే ఇలా చేస్తోందని బీజేపీ ఆరోపించింది.అయితే ఇప్పుడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. 
Read Also : నమో టీవీ కంటెంట్ ను ఢిల్లీ సీఈవోకి సమర్పించిన బీజేపీ

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌ గాంధీ ఆదివారం(ఏప్రిల్-14,2019) సిలిగురిలో పర్యటించాల్సి ఉంది.సిలిగురి పోలీస్‌ గ్రౌండ్‌ లో రాహుల్ హెలికాప్టర్ ల్యాండింగ్‌ కు కాంగ్రెస్‌ నేతలు అనుమతి కోరగా చివరి నిమిషంలో పోలీసులు నిరాకరించారు.స్థలం కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిలిగురి పోలీస్‌ కమిషనర్‌ బీఎల్‌ మీనా తెలిపారు.సిలిగురి పోలీస్‌ గ్రౌండ్‌ లో చాలా వాహనాలు పార్క్‌ చేసి ఉన్నాయని,స్థలం లేకపోవడంతో రాహుల్‌ హెలికాప్టర్‌ ను ఇక్కడ దించేందుకు  అనుమతి ఇవ్వలేదని మీనా తెలిపారు. 
అయితే పోలీసుల తీరుపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్‌ హెలికాప్టర్ ల్యాండింగ్‌ కోసం ఏప్రిల్‌- 7నే పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాశామని,చివరినిమిషంలో అనుమతి ఇవ్వలేమని పోలీసులు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పర్మిషన్ లేకపోవడంతో సిలిగురిలో  జరగాల్సిన ఎన్నికల ర్యాలీని రద్దు చేసినట్లు సీనియర్ కాంగ్రెస్ లీడర్,డార్జిలింగ్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ మలకర్ తెలిపారు.
Read Also : టీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోంది : బీజేపీ లక్ష్మణ్

Rahul gandhi
loksabha elections
SILIGURI
Cancelled
HELECOPTER
permission
Denied
LAND
Police
West Bengal
Govt

మరిన్ని వార్తలు