ఉద్యోగ సమాచారం : BECILలో పోస్టులు 

Submitted on 15 July 2019
BECIL Recruitment 2019: Apply for 2,684 Posts

ప్రభుత్వ రంగ సంస్థ, మినీరత్న కంపెనీ..బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) దేశ వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల్లో పనిచేసేందుకు స్కిల్డ్, ఆన్ స్కిల్డ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలై అయ్యింది. మొత్తం 2684 పోస్టులున్నాయి. 
Also Read : ఇంటర్‌తో ఐటీ కొలువు : HCLలో టెక్ బీ

స్కిల్ మ్యాన్ పవర్ - 1336
ఆన్ స్కిల్డ్ మ్యాన్ పవర్ - 1342
కన్సల్టెంట్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) - 4
అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ - 2

అర్హతలు : స్కిల్డ్ మ్యాన్ పవర్‌కు ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్ మెన్‌లలో ITI సర్టిఫికేట్ లేదా సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా, కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. 
అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు బీకామ్ / ఎంకామ్ / ఎంబీఏ (ఫైనాన్స్)తో పాటు కనీసం 5 ఏళ్ల అనుభవం తప్పనిసరి.
కన్సల్టెంట్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) పోస్టులకు బీటెక్ (ఎలక్ట్రికల్స్) ఉత్తీర్ణతతో పాటు కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి. 
ఆన్ స్కిల్డ్ మ్యాన్ పవర్‌కు 8వ తరగతి ఉత్తీర్ణత. కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి. 
వయస్సు : 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. 
దరఖాస్తు : ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తు ఫీజు : జనరల్ / ఓబీసీలకు రూ. 500, మిగతా అభ్యర్థులకు రూ. 250
దరఖాస్తుకు చివరితేదీ : 25-07-2019
ఇతర వివరాలకు వెబ్ సైట్ : www.becil.com

BECIL
recruitment
2019
Apply for
2
684 Posts

మరిన్ని వార్తలు