ఉచితంగా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం ఎలా..?

Submitted on 22 May 2019
Be Healthy: How Improve Your Health

ఖర్చు పెట్టి మందులను మాత్రమే కొనగలం. ఆరోగ్యాన్ని కొనలేం కానీ ఉచితంగానే పొందవచ్చు. మనం రోజూ చేసే పనులతోనే ఖర్చు లేకుండానే ఆరోగ్యంగా ఉండవచ్చు. కాకపోతే కొద్దిపాటి వ్యాయామం, మంచి బ్రేక్‌ఫాస్ట్, క్రమం తప్పకుండా వేళకు నిద్రపోవడం లాంటివి కొన్ని పాటించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఫ్రీగా లభించేవే. 

మనం పనిచేస్తే బాడీలో శక్తి పోయి నీరసం వస్తుంది. కానీ మనం పనిచేయకపోయినా మన కండరాలు దెబ్బతింటాయని మీకు తెలుసా?  సో ఆరోగ్యం బాగుండాలంటే ఖర్చు చేయాల్సింది డబ్బు కాదు.. కాస్త శారీరక శక్తినే. రోజుకు 40 నిమిషాల పాటు నడవాలి. మనం రోజూ ఉపయోగించే లిఫ్ట్‌కు బదులు మెట్లపై నడవడం, కాస్తంత సమీపంలోనే ఉన్న ప్రదేశాలకు వాహనాలు వాడకపోవడం వంటివి చేస్తే చాలు. దీనితో పాటు సరైన నిద్ర, తప్పనిసరిగా టైంకి బ్రేక్‌ఫాస్ట్, టైంకి మంచి ఆహారం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అలవాట్లు ఉంటే క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల అవి కూడా తగ్గే అవకాశం ఉంది.  

How Improve Your Health
health tips
2019

మరిన్ని వార్తలు