Loan dues : రాయపాటి..సుజనా ఆస్తుల వేలం

Submitted on 22 February 2020
Bank Auction Properties Of Rayapati Sambasiva Rao

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తుల వేలానికి రంగం సిద్ధమౌతోంది. వేలం వేయడానికి ఆంధ్రాబ్యాంకు సన్నాహాలు చేస్తోంది. గుంటూరు, న్యూఢిల్లీలోని ఆయననకు సంబంధించిన ఆస్తులను మార్చి 23వ తేదీన వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. రూ. 837.37 కోట్ల రుణాలు చెల్లించనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

గుంటూరు జిల్లాలోని అరండల్ పేటలోని 22 వేల 500 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న వాణిజ్య భవనం, న్యూఢిల్లీలోని ప్లాట్ను వేలం వేస్తున్నట్లు తెలిపింది. ట్రాన్స్ ట్రాయ్ ఇండియాతో పాటు చెరుకూరి శ్రీధర్, మల్లినేని సాంబశివరావు, రాయపాటి రంగారావు, దేవికారాణి లక్ష్మీ పేరిట సాంబశివరావు రుణం తీసుకున్నారని తెలిపింది. అయితే...గుంటూరు భవనం ఆస్తి విలువ రూ. 16.44 కోట్లు, ఢిల్లీలోని ప్లాట్ విలువ రూ. 1.09 కోట్లుగా నిర్ధారించింది. మిగిలిన వివరాల కోసం ఆంధ్రాబ్యాంకు వెబ్ సైట్ లేదా టెండర్స్ డాట్ గవ్ డాట్ ఇన్ ను సంప్రదించాలని ప్రకటనలో వెల్లడించారు. 

మరోవైపు టీడీపీ నుంచి బీజేపీలో జంప్ అయిన ఎంపీ సుజనా చౌదరికి కూడా..బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. సుజనా గ్రూప్ రూ. 400 కోట్లు రుణం తీసుకున్నారని... లోన్ డీ ఫాల్ట్ కిందకు బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తించింది. రుణాలు తీసుకున్న వారికి, గ్యారెంటీ ఇచ్చిన వారికి నోటీసులు జారీ చేసింది. 

ఇటీవలే రాయపాటిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రూ. 16 కోట్ల రూపాయలు సింగపూర్, మలేషియాకు మళ్లించినట్లుగా ఈడీ గుర్తించింది. రాయపాటితో పాటు ఆయన కుమారుడు రామారావు, ట్రాన్స్ ట్రాయ్ కంపెనీలపై ఇప్పటికే సీబీఐ కేసులు నమోదు చేసింది. సింగపూర్, మలేషియా, రష్యాలకు పెద్ద ఎత్తున నిధులు మళ్లించినట్లుగా అభియోగాలున్నాయి. 

Read More : ఢమరుకం మోగిస్తూ..శివుడి గెటప్‌లో శ్రీరెడ్డి చిందులు..

Bank Auction
Properties
Rayapati Sambasiva Rao
Sujana
Andhrabank

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు