బంగ్లా బాదేసింది.. విండీస్ ఇక ఇంటికే

Submitted on 17 June 2019
Bangladesh beat West Indies by 7 wickets

వరల్డ్ కప్ 2019టోర్నీ సెమీ ఫైనల్ ఆశలను విండీస్ చేజార్చుకుంది. సోమవారం బంగ్లాదేశ్ తో ఆడిన మ్యాచ్ లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. టాంటన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో బంగ్లా 7వికెట్ల తేడాతో గెలుపొందింది. 322పరుగుల లక్ష్య చేధనలో భాగంగా దిగిన బంగ్లాదేశ్.. ఇంకా 8ఓవర్లు మిగిలి ఉండగానే 3వికెట్ల నష్టానికి విజయం సాధించారు. షకీబ్ అల్ హసన్ (124; 99బంతుల్లో 16ఫోర్లు)తో అజేయంగా నిలిచి జట్టును ముందుకు నడిపాడు. అతనికి తోడుగా లిటన్ దాస్(94; 69బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సులు)తో విండీస్ లక్ష్యాన్ని సునాయాసంగా చేధించ గలిగారు. ఆండ్రీ రస్సెల్, ఒషానె థామస్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 

అంతకంటే ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ నాకౌట్ మ్యాచ్‌లో బంగ్లాపై విజృంభించి ఆడి 322పరుగుల టార్గెట్ నిర్దేశించారు. ఓపెనర్ గేల్ డకౌట్ గా వెనుదిరిగినప్పటికీ మిడిలార్డర్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. షై హోప్ సెంచరీకి చేరువలో వికెట్ సమర్పించుకున్నాడు. బంగ్లా బౌలర్లు మొహమ్మద్ సైఫుద్దీన్, ముస్తఫిజుర్ రెహ్మన్ చెరో 3వికెట్లు తీయగా షకీబ్ అల్ హసన్ 2వికెట్లు పడగొట్టాడు. 

కీలక మ్యాచ్ లో విండీస్ వీరులు రెచ్చిపోయారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ఆచితూచి ఆడుతూనే బంగ్లాకు భారీ టార్గెట్ నిర్దేశించింది. ఓపెనర్‌గా దిగిన క్రిస్ గేల్(0)డకౌట్ అయినా.. అతని స్థానంలో వచ్చిన షై హోప్(96; 121బంతుల్లో 4ఫోర్లు, 1సిక్సు)తో మరో ఓపెనర్(70; 67 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సులు)తో చక్కటి సహకారాన్ని అందించాడు. 

వీరి భాగస్వామ్యానికి షకీబ్ అల్ హసన్ బ్రేక్ వేస్తూ 24.3ఓవర్లకు 122పరుగుల వద్ద ఎవిన్ లూయీస్‌ను పడగొట్టాడు. చివరి ఓవర్ల వరకూ పాతుకుపోయిన హోప్ సెంచరీకి ముందు అవుటయ్యాడు. పూరన్(25), హెట్‌మేయర్(50)లతో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. తర్వాత రస్సెల్(0)తో నిరుత్సాహపరచగా జాసన్ హోల్డర్(33), డారెన్ బ్రావో(19), థామస్(6)పరుగులు చేసి జట్టుకు 321పరుగుల భారీ స్కోరు తెచ్చిపెట్టారు.

bangladesh
west indies
2019 icc world cup
world cup 2019
cricket


మరిన్ని వార్తలు