సినిమా రివ్యూ : ఎన్టీఆర్ మహానాయకుడు

Submitted on 22 February 2019
Balakrishna's Ntr MahaNayakudu Movie Review

నటుని జీవితాన్ని తెరపై ఆవిష్కరించాలంటే తేలికైన విషయం కాదు.. అలాంటిది ఒక మహా నటుడు విషయం తెరకెక్కించాలంటే అది సాహసమే. అటువంటి సాహసమే నందమూరి బాలకృష్ణ చేశాడు. తెలుగు సినీ చరిత్రనే మలుపు తిప్పిన, రాజకీయాల రూపురేఖలను మార్చిన మహానాయకుని జీవిత చరిత్రను ఒక సినిమగా తీసి సాహసం చేసిన బాలకృష్ణ ప్రయత్నం ఫలిచిందా? తొలిభాగంలాగే రెండవ భాగం నిరుత్సాహపరిచిందా? బాలకృష్ణ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఎన్టీఆర్ మహా నాయకుడు ఎలా ఉంది? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ: 
తొలి సినిమా క్లైమాక్స్ లో NTR తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రజల్లోకి వస్తాడు. ఇప్పుడు రెండవ భాగంలో పార్టీ రూపకల్పన జెండా నిర్మాణం, ఆ తరువాత పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఢిల్లీ గద్దెను సైతం సడలించి.. తెలుగుదేశం పార్టీని పవర్ లోకి తీసుకురావడానికి ఎన్టీఆర్ చేసిన ప్రచారం వాటి వాటితో సినిమా కథ నడుస్తుంది. ఎన్నికల్లో తెలుగుదేశం ఘనవిజయం సాధించిన తర్వాత ఎన్టీఆర్ ని పదవి నుంచి దించడానికి ప్రధానిమంత్రితో కుమ్మక్కవవుతాడు టీడీపీ నిర్మాణంలో మెయిన్ పిల్లర్ గా ఉన్న భాస్కరరావు. దాంతో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యిందని భావించిన ఎన్టీఆర్ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎలాంటి పోరాటం జరిపాడు. ప్రజా పోరాటంతో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎలా అధికారాన్ని చేజిక్కించుకున్నాడు? అనే విషయాలతో పాటు బసవతారకం కన్నుమూయడం తదితర రియల్ ఇన్సిడెంట్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

నటీనటులు
ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ గా నటించిన బాలయ్య యంగ్ ఏజ్ లో ఎన్టీఆర్ గా కనిపించినప్పుడు రిసీవ్ చేసుకోవడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ ఈ సినిమాలో ఎక్కువగా వయసు మళ్ళిన పాత్రలోనే కనిపించడంతో చాలా చోట్ల ఎన్టీఆర్ లానే కనిపించాడు. కాకపోతే ఎన్టీఆర్ లో సహజంగానే ఉండే గాంభీర్యాన్ని చూపించాల్సి వచ్చినప్పుడు మాత్రం బాలయ్య నటన ఇంకాస్త సహజంగా ఉండి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ వరకు మాత్రం బాలయ్య బాగా నటించాడు.ఇక బసవతారకం పాత్రలో విద్య బాలన్ నటనకి పేరు పెట్టడానికి లేదు. చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ తో తోనే బోలెడంత భావాలని పలికించింది.చంద్రబాబు నాయుడు గా మెప్పించడానికి రానా చాలా హార్డ్ వర్క్ చేసాడు. అక్కడక్కడా బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్ డెలివరీ లో చంద్రబాబు ని ఫాలో అయిపోయాడు.  భాస్కరరావు నాదెళ్ల గా సచిన్ కేల్కర్ 100% న్యాయం చేసాడు.ఆ పాత్రలోని సైలెంట్ అండ్ సాఫ్ట్ కన్నింగ్ నేచుర్ ని బాగా ఎలివేట్ చెయ్యగలిగాడు. హరికృష్ణగా కళ్యాణ్ రామ్ పర్లేదు. ఎన్టీఆర్ అల్లుడు వెంకటేశ్వర రావు గా భరత్ రెడ్డి  బాగా సెట్ అయ్యాడు. మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు.

టెక్నీషియన్స్ విషయానికి వస్తే.... 
మొదటి పార్ట్ ని కూడా సెన్సిబుల్ గానే తీర్చిదిద్దినా కూడా కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలవడంతో ఈ సినిమావరకు ఎక్కువగా ఎమోషన్స్ ని నమ్ముకున్నాడు క్రిష్. ఎన్టీఆర్ తో ముడిపడిన ప్రతి అంశాన్ని కూడా ఎమోషనల్ టచ్ తోనే డీల్ చెయ్యాలని చూసాడు.అయితే కీలకమయిన ఎపిసోడ్స్ ని తీర్చిదిద్దంలో మాత్రం తడబడ్డాడు.దాంతో ఎన్టీఆర్ మళ్ళీ తిరిగి అధికారాన్ని చెక్కిక్కించుకునే సీన్స్ లాంటివి మామూలుగా అనిపించాయి.చంద్రబాబు నాయుడు పాత్రని పెంచడం, తెలుగుదేశంలో అతని ఇంపార్టెన్సీ తెలిసేలా చెయ్యడం కోసం పెట్టిన సీన్స్ అక్కడక్కడా సినిమాని డీవియేట్ చేశాయి. ఓవరాల్ గా చూసుకుంటే క్రిష్ కి డైరెక్టర్ గా పాస్ మార్క్స్ పడతాయి.ఇక సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ చాలావరకు పేలాయి. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్. అతను వాడిన టోనింగ్ వల్ల సినిమాకి చాలా చోట్ల వింటేజ్ లుక్ వచ్చింది. కీరవాణి సంగీతం ఓకే అనిపిస్తుంది.నిర్మాణ విలువలు బావున్నాయి.

ప్లస్ పాయింట్స్:
లీడ్ కాస్ట్ నటన 
ఎమోషనల్ సీన్స్
సినిమాటోగ్రఫీ
డైలాగ్స్
ఆర్.ఆర్

మైనస్ పాయింట్స్
ఎక్కువయిన సినిమాటిక్ లిబర్టీ
కీ సీన్స్ ఎక్సిక్యూషన్
సెకండ్ హాఫ్ గ్రాఫ్
తగ్గిన ఎలివేషన్స్

చివరి మాట:
ఓవరాల్ గా చూసుకుంటే ఎన్టీఆర్ మహానాయకుడు ఎక్కువమందికి తెలిసిన కథే అయినా.. క్రిష్ మార్క్ ఎమోషనల్ టచ్, బాలయ్య నటన వంటివి హైలైట్స్ గా నిలవడంతో ఎన్టీఆర్ మహానాయకుడు ఒక మోస్తరు విజయం అందుకునే అవకాశం ఉంది. కమర్షియల్ గా ఈ సినిమా ఎంతవరకు లాభాలు తెచ్చిపెడుతుందో చూడాలి.


Read Also: ఒక్కో అమరవీరుడి కుటుంబానికి రూ.25లక్షల సాయం : సీఎం కేసీఆర్
Read Also: బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేసీఆర్

NTR Mahanayakudu
VidyaBalan
Keeravani
SaiMadhav Burra
Rana
Krish
Balakrishna

మరిన్ని వార్తలు