బద్లా-ట్రైలర్

Submitted on 12 February 2019
 Badla Official Trailer-10TV

 బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రధారులుగా, సుజాయ్ ఘోష్ డైరెక్షన్‌లో, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, అజూర్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా.. బద్లా.. పింక్ తర్వాత అమితాబ్, తాప్సీ నటిస్తున్న సినిమా ఇది. రీసెంట్‌గా బద్లా ట్రైలర్ రిలీజ్ చేసారు.. బిజినెస్ ఉమెన్ అయిన తాప్సీని ఒక హోటల్ రూమ్‌లో బంధించడం, ఆమె సృహలోకి వచ్చేసరికి పక్కనే డెడ్ బాడీ ఉండడం, పోలీసులు అరెస్ట్ చెయ్యడం, ఆ కేస్ నుండి బయట పడడానికి లాయర్ అమితాబ్ హెల్ప్ తీసుకోవడం వంటి అంశాలన్నీ ట్రైలర్‌లో చూపించారు. ఏదైనా నిరూపిస్తేనే అది నిజం అవుతుంది.. కేవలం నిజం తెలిసినవాడు మూర్ఖుడు.. ఏది నిజమో, ఏది అబద్దమో కూడా తెలిసుండాలి.. అని అమితాబ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది.

ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. కెమెరా వర్క్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. మార్చి 8 న బద్లా రిలీజవుతుంది. ఈ సినిమాకి కెమెరా : అవిక్ ముఖోపాద్యాయ్, నిర్మాతలు : గౌరీఖాన్, సునీర్ ఖేతెర్‌పాల్, అక్షీపూరీ.

వాచ్ బద్లా ట్రైలర్...

Amitabh Bachchan
Taapsee Pannu
Gauri Khan
Sunir Kheterpal
Akshai Puri
Sujoy Ghosh


మరిన్ని వార్తలు