ఫస్ట్ టైం ఐస్ క్రీం తిన్న చిన్నారి రియాక్షన్ చూశారా 

Submitted on 21 January 2020
Baby girl tastes ice cream Brittani Jernigan

చిన్న పిల్లలు..వారు చేసే అల్లరి, చేష్టలు ఎంతో ముద్దుగా ఉంటాయి. అవే తరచూ గుర్తుకొస్తుంటాయి. ఏమీ తెలియని వారు అమాయకంగా వారు చేస్తున్న అల్లరి చూస్తున్న వారి పెదవులపై నవ్వు కనిపిస్తుంటుంది. ఇలా అల్లరి, అమాయకంగా చేస్తున్న చిన్నారుల వీడియోలను పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుంటారు. కానీ ఈ వీడియో మాత్రం స్పెషల్.

ఎందుకంటే..ఓ చిన్నారి ఎదుట ఐస్ క్రీం పెట్టారు. ఎప్పుడు ఆ చిన్నారికి రుచి తెలియదు. టేస్టు తెలియగానే..అమాంతం దానిని పట్టేసుకుంది. వదలంటే వదలనంది. ఈ వీడియోను చూసిన వారు..ఇతర చిన్న పిల్లలు చేసిన వాటిని పోస్టు చేస్తున్నారు. 

Read More : వండర్ వరల్డ్ : ఫైర్ ఫాల్ గురించి తెలుసా 

తల్లి బ్రిటానీ జెర్నిగాన్ టిక్ టాక్ ద్వారా ఇన్ స్ట్రా గ్రామ్‌లో ఈ వీడియో షేర్ చేశారు. చిన్నారి ఎదుట ఐస్ క్రీం పెట్టారు. మొదట..ఏమీ తెలియనట్లుగా ఉంది. కానీ..ఐస్ క్రీం రుచి చూసిన తర్వాత..కళ్లు పెద్దవిగా చేస్తూ..అమాంతం దానిని పట్టేసుకుంది. లాగేసుకోవాలని ప్రయత్నించిన్పపుడు దగ్గరగా పట్టుకోవడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో పోస్టు చేసిన క్షణమే వైరల్‌గా మారిపోయింది. 3.8 లక్షల లైక్స్, టిక్ టాక్‌లో 3 వేల 300 కామెంట్స్ వచ్చాయి. బ్యూటిఫుల్ ఐస్, లవ్ అట్ ఫస్ట్ టేస్ట్ అంటూ..కామెంట్స్ పెడుతున్నారు. 

 

 

@mamabritti

#cute #funny #waitforit #love

♬ original sound - mamabritti
baby
Girl
tastes
ice cream
Brittani Jernigan
tik tok

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు