బాహుబలి స్క్రీనింగ్ : ఆల్బర్ట్ హాల్ అదిరింది!

Submitted on 21 October 2019
Baahubali

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేసిన సినిమా.. ‘బాహుబలి : ది బిగినింగ్’.. అక్టోబర్ 19న ఈ సినిమా లండన్‌లోని ప్రఖ్యాత ‘రాయల్ ఆల్బర్ట్ హాల్’ లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే.. రాజమౌళి, రమా రాజమౌళి, కీరవాణి, వల్లి, ప్రభాస్, రానా, అనుష్క, కాల భైరవ, నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు.

కీరవాణి ఆధర్వంలో నిర్వహించిన బాహుబలి బ్యాగ్రౌండ్ స్కోర్ లైవ్‌లో వినిపించారు.. దీనికి అక్కడి ఆడియన్స్ నుండి విశేష స్పందన లభించింది. ఈ షోకు హాజరైన వారందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం గర్వకారణం.. 148 ఏళ్ల  రాయల్ ఆల్బర్ట్ హాల్ చరిత్రలో స్క్రీనింగ్ జరుపుకున్న ఫస్ట్ నాన్ ఇంగ్లీష్ ఫిలింగా ‘బాహుబలి : ది బిగినింగ్’ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.

Read Also : ‘సరిలేరు నీకెవ్వరు’ దివాళీ ట్రీట్

రాజమౌళి తెలుగుదనం ఉట్టి పడేలా పంచె కట్టులో మెరిశారు. ప్రభాస్, అనుష్క, రానాలతో ఇంటర్వూ కోసం అక్కడి ఛానెల్స్ పోటీ పడ్డాయి.. యంగ్ టైగర ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.   

Baahubali: The Beginning
Royal Albert Hall
Prabhas
Rana
Anushka
M M Keeravani
SS Rajamouli

మరిన్ని వార్తలు