తమిళనాట ‘‘బాహుబలి : ది బిగినింగ్’’ రీ-రిలీజ్

Submitted on 20 November 2019
Baahubali: The Beginning is re-releasing in Tamil Nadu

‘‘బాహుబలి : ది బిగినింగ్’’.. తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా.. ఇది మా తెలుగు సినిమా అని తెలుగు ప్రేక్షకులు గర్వంగా చెప్పుకునేలా చేసిన సినిమా.. దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన మాహిష్మతి సామ్రాజ్యానికి సినీ జనాలు సెల్యూట్ చేసిన సినిమా.. 2015 జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయఢంకా మోగించింది బాహుబలి..

అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి, శివగామి, కట్టప్ప, దేవసేన, భళ్లాలదేవ, బిజ్జలదేవ, అవంతిక క్యారెక్టర్స్‌కి, సినిమాలోని ఎమోషన్‌కి భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయ్యారు. సెకండ్ పార్ట్ ‘‘బాహుబలి : ది కన్‌క్లూజన్’’ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ‘‘బాహుబలి : ది బిగినింగ్’’ ఇప్పుడు రీ-రిలీజ్ కానుంది. నవంబర్ 22న తమిళనాట విడుదల కానుంది.


Read Also : ‘‘జార్జ్ రెడ్డి’’ సెన్సార్ పూర్తి

తమిళ ప్రేక్షకులలో విపరీతమైన ఆదరణ ఉన్నందున, పంపిణీదారులు ఈ చిత్రాన్ని తిరిగి విడుదల చేయనున్నారు. ఈ శుక్రవారం తమిళనాడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ‘‘బాహుబలి : ది బిగినింగ్’’ రీ-రిలీజ్ కానుంది.. సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి, కెమెరా : కె.కె.సెంథిల్ కుమార్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాణం : ఆర్కా మీడియా వర్క్స్..
 

Prabhas
Rana Daggubati
Tamannaah
Anushka Shetty
Ramya Krishna
M. M. Keeravani
Arka Media Works
S. S. Rajamouli

మరిన్ని వార్తలు