ఆజంఘడ్‌ మదరసా విద్యార్ధి సివిల్స్ కు ఎంపిక

Submitted on 22 April 2019
Azamgarh Madrasa student Shahid Raza Khan select to civils

యూపీఎస్సీ పరీక్షల్లో 751 వ ర్యాంకు సాధించిన ఆజంఘడ్‌ మదరసా విద్యార్ధి షాహిద్‌ రజా ఖాన్‌ సివిల్స్ కు ఎంపికయ్యారు. కైఫీ ఆజ్మీషిబ్లీ నోమానీల జన్మస్థలమైన ఆజంఘడ్‌ మదరసా తాను బాగా చదువుకునేందుకు ఉపయోగపడిందని ఖాన్‌ షాహిద్‌ రజా ఖాన్‌ అన్నారు. బీహార్‌ గయా పట్టణానికి చెందిన షాహిద్‌ తన ప్రాథమిక విద్య ఆజంఘడ్‌లోని మదరసాలోనే సాగిందని చెప్పారు. తాను మదరసాలో ఉర్దూ భాషలోనే చదివి అదే ఆప్షనల్‌గా యూపీఎస్సీ పరీక్ష రాశానని తెలిపారు. తన తల్లితో పాటు మదరసాలోనే తాను స్ఫూర్తి పొంది సివిల్‌ సర్వీసుకు ఎంపికయ్యానని చెప్పారు. తనకు మతం మానవత్వాన్ని నేర్పిందని ఖాన్‌ తెలిపారు.

Azamgarh Madrasa
student
Shahid Raza Khan
select
civils

మరిన్ని వార్తలు