అనుచిత వ్యాఖ్యల ఫలితం : మేనకా గాంధీ, ఆజంఖాన్ ప్రచారంపై ఈసీ నిషేదం

Submitted on 15 April 2019
Azam Khan, Maneka Gandhi, Face, Campaign Ban, Poll Code Violation, jayapradha


ఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో లిమిట్స్ క్రాస్ చేసిన వారిపై ఈసీ సీరియస్ అయ్యింది. నోరు జారిన వారిపై చర్యలు తీసుకుంది. ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలపై యాక్షన్ తీసుకున్న ఈసీ ఇప్పుడు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ, సమాజ్ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ పై చర్యలు తీసుకుంది. వారి ప్రచారంపై ఆంక్షలు విధించింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని కంప్లయింట్స్ రావడంతో ఈసీ వేటు వేసింది. ఆర్టికల్ 324 కింద చర్యలు తీసుకుంది.

మేనకాగాంధీ 48 గంటల ప్రచారంపై నిషేధం విధించిన ఎన్నికల సంఘం.. ఆజంఖాన్ పట్ల మరింత కఠినంగా వ్యవహరించింది. దేశవ్యాప్తంగా ఆజంఖాన్ 72 గంటలు ప్రచారం చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. రోడ్ షో, ఇంటర్వ్యూలు, సభలు, సమావేశాల్లోనూ వీరు మాట్లాడకూడదు. ప్రచారానికి సంబంధించి నోటి నుంచి మాటలు రాకూడదు. ఎన్నికల ప్రచారంలో మేనకాగాంధీ మతపరమైన కామెంట్లు చేశారు. ముస్లింలంతా తనకే ఓటు వేయాలని అన్నారు. జయప్రదపై ఆజంఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీటిపై ఈసీకి ఫిర్యాదులు అందాయి. దీంతో ఈసీ చర్యలకు దిగింది. యోగి, మాయావతి, మేనకాగాంధీ, ఆజంఖాన్ ల నోటికి తాళం వేసింది.

ఏప్రిల్ 12వ తేదీన సుల్తాన్‌పూర్‌లోని ముస్లింల ఆధిక్యత ఉన్న తురబ్ ఖానీ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మేనకా గాంధీ పాల్గొన్నారు. ముస్లింలు తనకు ఓటు వేయకుంటే వారికి ఉద్యోగాలు ఇచ్చేది లేదని అన్నారు. ఓటు వేయకుండా ఉద్యోగాలు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఇది ఇచ్చి పుచ్చుకునే పద్ధతి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాంపూర్‌ బీజేపీ అభ్యర్థి, సినీనటి జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అజంఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళలపై చౌకబారు వ్యాఖ్యలు చేసిన ఆజంఖాన్ పై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చాయి.

Azam Khan
Maneka Gandhi
Face
Campaign Ban
Poll code violation
jayapradha

మరిన్ని వార్తలు