‘ఏంది.. ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా’.. చైతులో కొత్త కోణం చూస్తారు..

Submitted on 14 February 2020
Ay Pilla Musical Preview - Love Story Movie

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా.. ‘లవ్ స్టోరి’.. చైతు హీరోగా నటిస్తున్న 19వ సినిమా ఇది.. వాలెంటైన్స్ డే సందర్భంగా అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ‘ఏయ్ పిల్లా’ మ్యూజికల్ ప్రివ్యూ రిలీజ్ చేశారు.

చైతు, పల్లవిల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ఇద్దరిపై పిక్చరైజ్ చేసిన మాంటేజ్ షాట్స్ బాగున్నాయి. అందరిముందు మెట్రోలో సాయి పల్లవి, చైతుకి ముద్దుపెట్టగా అతనిచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అదిరిపోయాయి. పాతికేళ్లు వచ్చినా ఎవ్వరూ పట్టించుకోకుండా ఉన్నప్పుడు, ఒక అమ్మాయి నిన్ను నమ్ముతుంది, ప్రేమిస్తుంది, అడగకుండానే ముద్దు ఇస్తుంది.. అప్పుడు ఆ క్షణం ఆనందంతో ఏడ్చేస్తే ఎలా ఉంటుందనేది చైతు హావభావాలు చూస్తే అర్థమవుతోంది. బహుశా ఫస్ట్ కిస్ ప్రభావాన్ని ఇంతకంటే గొప్పగా చూపించలేరేమో అన్నంత అద్భుతంగా చేశాడు చైతు.

‘ఏంది, ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా..’ అని సాయిపల్లవి చెప్పే డైలాగ్‌ హైలెట్‌గా నిలిచింది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. సోనాలి నారంగ్ సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, ఏమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కెమెరా : విజయ్ సి కుమార్, సంగీతం : పవన్. 
 

Love Story

Click Here>>డేంజర్ బెల్స్.. ఒక్కసారిగా 50వేల మందికి కరోనా వైరస్

LoveStory
Ay Pilla Musical Preview
Naga Chaitanya
Sai pallavi
Amigos Creations
Sree Venkateswara Cinemas LLP
Pawan Ch
Sekhar Kammula

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు