ఇక దొంగతనం చెయ్యలేరు : ఆధార్ సేఫ్టీకి కొత్త ఫీచర్

Submitted on 10 December 2019
Avoid Aadhaar misuse, lock and unlock Aadhaar number online

ఏ పనికైనా ఇప్పుడు ఆధార్ నెంబరే ఆధారం. ఆధార్ లేనిదే పని జరగదు. అందుకే ప్రతి ఒక్కరు ఆధార్ తీసుకుంటున్నారు. అయితే ఆధార్ భద్రతపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఆధార్ వివరాలను చాలా ఈజీగా దొంగతనం చేసి దుర్వినియోగం చేస్తున్నారు. దీంతో భద్రత గురించి అందరూ టెన్షన్ పడుతున్నారు. అయితే ఇక ముందు అలాంటి టెన్షన్స్ అవసరం లేకుండా ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)’ ఓ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. 

ఆధార్ నంబర్ ను లాక్, అన్ లాక్ చేసుకునే కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఆధార్ దుర్వినియోగానికి చెక్ చెప్పొచ్చు. వ్యక్తి ఆధార్ సంఖ్య గోప్యత, భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఈ చర్య తీసుకున్నారు. ఆధార్ నంబర్ ను లాక్ చేసుకుంటే... ఇతరులు ఎవరూ ఉపయోగించలేరు. ఉదాహరణకు జనాభా, బయోమెట్రిక్ లేదా వన్ టైమ్ పాస్‌వర్డ్ తదితర అంశాలు సహా ఇతరత్రా ప్రక్రియలకు ఆధార్ సంఖ్యను ఉపయోగించి చేయలేరు. ఆధార్ నంబర్‌ను అన్‌లాక్ చేసిన తర్వాతే గుర్తింపు అవసరాల కోసం ఉపయోగించొచ్చు.

* ఆధార్ నంబర్ ను లాక్ చేసే ముందు వర్చువల్ ఐడీని జనరేట్ చేసుకోవాలి.
* వర్చువల్ ఐడీని జనరేట్ చేసుకోకపోతే ఆధార్ నంబర్‌ను లాక్ చేయలేరు.
* యూఐడీఏఐ వెబ్‌సైట్ నుండి లేదా ఎస్ఎంఎస్ ద్వారా వర్చువల్ ఐడీని రూపొందించుకోవచ్చు.
* పూర్తి వివరాల కోసం ‘www.uidai.gov.in’లోకి వెళ్లాలి.
* ఇంటర్నెట్‌ సౌకర్యం లేకపోతే లేదా యూఐడీఏఐ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయలేకపోతే SMS ద్వారా ఆధార్ నంబర్‌ను లాక్ లేదా అన్‌లాక్ చేయొచ్చు.
* మొబైల్ నంబర్ నుంచి 1947 కు SMS పంపడం ద్వారా కూడా ఆధార్ నంబర్‌ను లాక్ / అన్‌లాక్ చేసుకోవచ్చు.

ఆధార్ లాక్ చేయడం కోసం :
* రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 1947 కి ఎస్ఎంఎస్ పంపాలి
* GETOTP అని టైప్ చేసి ఆధార్ నెంబర్ చివరి నాలుగు అంకెలను జోడించి UIDAIకి SMS పంపాలి.
* UIDAI నుంచి 6 అంకెల ఓటీపీ SMS ద్వారా వస్తుంది.
* ఓటీపీ వచ్చాక LOCKUID అని టైప్ చేసి ఆధార్ నెంబర్ లోని చివరి నాలుగు అంకెలు, 6అంకెల ఓటీపీని SMS చేయాలి.
* SMS చేరిన వెంటనే UIDAI ఆధార్ నెంబర్ ని లాక్ చేస్తుంది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి కన్ ఫర్మేషన్ SMS వస్తుంది.

ఆధార్ అన్ లాక్ చేయడం కోసం:
* రిజిస్టర్డ్ మొబైల్ నుంచి 1947కి SMS చేయాలి. GETOTP అని టైప్ చేసి ఆరు అంకెల వర్చువల్ ఐడీ నెంబర్ జోడించి ఎస్ఎంఎస్ పంపాలి.
* UIDAI నుంచి వెంటనే ఆరు అంకెల ఓటీపీ SMS ద్వారా వస్తుంది.
* UNLOCKUID అని టైప్ చేసిన ఆరు అంకెల వర్చువల్ ఐడీ నెంబర్ టైప్ చేసి, 6 అంకెల ఓటీపీపి జత చేసి ఎస్ఎంఎస్ పంపాలి.
* రెండో ఎస్ఎంఎస్ వచ్చిన వెంటనే UIDAI ఆధార్ నెంబర్ ని అన్ లాక్ చేస్తారు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి కన్ ఫర్మేషన్ మేసేజ్ వస్తుంది.

Avoid
Aadhaar misuse
lock
unlock
Aadhaar number online

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు