నవరత్నాలకు పవన్ అనుకూలమా..వ్యతిరేకమా

Submitted on 14 September 2019
Avanti Srinivas has criticized Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. సీఎం జగన్ వంద రోజుల పాలనపై పవన్ విమర్శలు చేయడాన్ని వారు తప్పుబడుతున్నారు. పవన్ కళ్యాణ్ పై మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శలు చేశారు. నవరత్నాలకు పవన్ అనుకూలమా..వ్యతిరేకమా చెప్పాలన్నారు. శనివారం (సెప్టెంబర్ 14, 2019) విశాఖలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ఉచ్చులో పడొద్దని పవన్ కు విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. ప్రభుత్వాన్ని విమర్శించే ముందు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. బడ్జెట్ లో సీఎం జగన్ కాపులకు రూ.2 వేల కోట్లు ఇచ్చారని తెలిపారు. మద్యపాన నిషేధం అమలు చేసి చూపిస్తామని చెప్పారు.  

పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాలు చేయరని, ఎవరో రాసిన స్క్రిప్ట్‌ని చదివి వెళ్లిపోతారని మంత్రి వనిత కామెంట్ చేశారు. ప్యాకేజీ స్టార్ మళ్లీ తెరపైకి వచ్చారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల పక్షాన నిలబడాలని అనుకుంటే..అలానే చేయాలని, ప్రజల మధ్యలో తిరిగితే..వారి సమస్యలు ఏంటో తెలుస్తుందన్నారు. లోటుపాట్లు ఉంటే తెలియచేయాలని..సరిదిద్దుకుంటామన్నారు మంత్రి వనిత. 

బాబు, బీజేపీతో పవన్ లాలూచీ పడ్డారని ఆరోపించారు మంత్రి ఆదిమూలపు సురేష్. అవగాహన లేకుండా ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని, 100 రోజుల్లోనే 80 శాతం హామీలు నెరవేర్చినట్లు వెల్లడించారు. పార్టీలకు అతీతంగా గ్రామ వాలంటీర్ల ఎంపిక చేయడం జరిగినట్లు, వైసీపీ వారిని మాత్రమే నియమించినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. RTA ద్వారా దరఖాస్తు చేసుకుంటే వివరాలు ఇవ్వడం జరుగుతుందని సూచించారు. 
 

avanti srinivas
criticized
Pawan kalyan
Visakha

మరిన్ని వార్తలు