బంగ్లాతో మ్యాచ్ : టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ 

Submitted on 20 June 2019
Australia won the toss and elected to bat

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా గురువారం ఇక్కడ నాటింగ్ హామ్ వేదికగా బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత ఓపెనర్లుగా కెప్టెన్ అరోన్ పించ్, విధ్వంసక బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ బరిలోకి దిగారు. ముష్రాఫే మోర్తాజా తొలి ఓవర్ అందుకున్నాడు.

ఆసీస్ ఓపెనర్లు జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. బంగ్లా బౌలర్ల బంతులను ధీటుగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారిస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 14.3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 90 పరుగులతో కొనసాగుతోంది. ఓపెనర్లు ఫించ్ (39), వార్నర్ (51)హాఫ్ సెంచరీతో క్రీజులో కొనసాగుతున్నారు.

వరల్డ్ కప్ టోర్నీలో వరుస విజయాలతో దూకుడు మీదున్న ఆసీస్.. బంగ్లాపై విజయం సాధించి అగ్రస్థానంతో పాటు సెమీస్ కు చేరువ కావాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటివరకూ ఆసీస్ ఆడిన ఐదు మ్యాచ్ ల్లో 4 మ్యాచ్ ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ లో ఓడింది. పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతోంది.

బంగ్లాతో మ్యాచ్ లో ఆసీస్ గెలిస్తే మరో రెండు పాయింట్లు వచ్చి చేరి అగ్రస్థానంలో చేరుతుంది. మరోవైపు బంగ్లాదేశ్ ఆడిన 5 మ్యాచ్ ల్లో 2 మ్యాచ్ ల్లో గెలిచింది. రెండు మ్యాచ్ ల్లో ఓడింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. పాయింట్ల పట్టికలో బంగ్లా 5 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతోంది. 

Australia
bangladesh
Warner
Pinch
world cup 2019

మరిన్ని వార్తలు