టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

Submitted on 12 January 2019
Australia won the toss and chose to bat

సిడ్నీ : భారత్‌తో తొలి వన్డే మ్యాచులో టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వన్డేకి సిడ్నీ వేదికైంది. ఇటీవల ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో గెలిచింది. టెస్టు సిరీస్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. మార్కస్ స్టోయిన్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లకు తుది జట్టులో స్థానం కల్పించిన ఆసీస్.. ఒక్కే ఒక్క స్పిన్నర్ నాథన్ లియాన్‌తో బరిలోకి దిగింది. వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే ఆడం జంపాను పక్కనపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల చేసిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌‌పై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. నిషేధానికి గురైన నేపథ్యంలో వారిద్దరూ తొలి వన్డేలో చోటు కోల్పోయారు. పాండ్య, కేఎల్ రాహుల్‌ స్థానాల్లో అంబటి రాయుడు, రవీంద్ర జడేజాలకు భారత జట్టులో చోటు కల్పించారు.

భారత జట్టు: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్), అంబటి రాయుడు, దినేశ్‌ కార్తిక్‌,  ధోని(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మహమ్మద్‌ షమీ, ఖలీల్‌ అహ్మద్‌.

ఆసీస్‌ జట్టు: ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్), అలెక్స్‌ కారే(వికెట్‌ కీపర్‌), ఉస్మాన్‌ ఖవాజా, షాన్‌మార్ష్‌, పీటర్‌ హాండ్స్‌కాంబ్‌, మార్కస్‌ స్టోయినిస్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, పీటర్‌ సిడిల్‌, రిచర్డ్‌సన్‌, నాథన్‌లైయన్‌, జాసన్‌ బహ్రెన్‌డోర్ఫ్‌.

Australia
won
toss
chose to bat
sidney
india
onday match

మరిన్ని వార్తలు