లంక చేతులెత్తేసింది: ఆసీస్‌కు భారీ విజయం

Submitted on 15 June 2019
Australia won by 87 runs

లంక బ్యాట్స్‌మెన్ ఆసీస్ ధాటికి చేతులెత్తేశారు. వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా శనివారం ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆసీస్.. లంకపై 87పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. చేధనలో లంక కెప్టెన్ దిముత్ కరుణ్ రత్నె(97; 108 బంతుల్లో 9ఫోర్లు)తో ఒంటరి పోరాటం ఫలించలేదు. ఆసీస్ బౌలర్లు మిచెల్ స్టార్క్ 4వికెట్లు, రిచర్డ్ సన్ 3వికెట్లు, పాట్ కమిన్స్ 2వికెట్లు, జాసన్ బహ్రెండార్ఫ్ 1వికెట్ తీయడంతో లంక 247పరుగులకు చాపచుట్టేసింది. 

అంతకంటే ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ విరుచుకుపడ్డారు. ఓపెనర్.. కెప్టెన్ ఆరోన్ ఫించ్(153; 132 బంతుల్లో 15ఫోర్లు, 5సిక్సులు) లంక బౌలర్లకు ముచ్చెమటలు పోయించాడు. ఫించ్‌కు తోడుగా స్టీవ్ స్మిత్(73; 59 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్సు) క్రీజులో నిలవడంతో లంక జట్టుకు 335పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది. లంక బౌలర్లలో ఇసురు ఉడానా ధనంజయ డి సెల్వా చెరో 2వికెట్లు పడగొట్టగా లసిత్ మలింగ ఒక వికెట్ దక్కించుకున్నాడు. 

ఆరంభంలో కాస్త తటపటాయించినా నిదానంగా కుదురుకుని చెలరేగింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ రెచ్చిపోవడంతో జట్టుకు అద్భుతమైన స్కోరు వచ్చి చేరింది. తొలి వికెట్ డేవిడ్ వార్నర్(26) అవుట్ అయ్యేసరికి జట్టు స్కోరు 16.4ఓవర్లకు 80పరుగులుగా ఉంది. ఈ సమయంలో మూడో వికెట్ గా అడుగుపెట్టిన ఉస్మాన్ ఖవాజా(10)స్వల్ప విరామంతోనే వెనుదిరిగాడు. 
 
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్.. ఫించ్‌కు సహకారం అందించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ దశలో 42.4ఓవర్లకు ఫించ్ అవుటవగా స్వల్ప విరామంతో ఐదు బంతుల వ్యవధిలోనే స్మిత్ పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన షాన్ మార్ష్(3), అలెక్స్ క్యారీ(4), పాట్ కమిన్స్(0), మిచెల్ స్టార్క్(5)పరుగులు చేయడంతో జట్టు 334పరుగులు చేయగలిగింది. 

Australia
Sri Lanka
AUS
sl
2019 icc world cup
world cup 2019

మరిన్ని వార్తలు