సిడ్నీ టెస్టు : సిరీస్ మనదేనా..ఆసీస్ 257/8

Submitted on 6 January 2019
Australia trail by 365 runs with 2 wickets remaining in the innings | 10TV

సిడ్నీ : సిడ్నీ టెస్టుపై తిరుగులేని ఆధిపత్యాన్ని భారత్ ప్రదర్శించింది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫి విజయాన్ని ఖాయం చేసుకుంది. సిరీస్ విజయం 2-1 లేదా 3-1 తేడాతో తేలాల్సి ఉంది. ఇంకా రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఆసీస్ మరో 187 పరుగులు చేయకుంటే మాత్రం ఫాలో ఆన్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇప్పటికే టెస్టుపై ఆశలు కోల్పోయిన అతిథ్య జట్టు...డ్రాపై ఆశలు పెట్టుకుంది. 
రాణించిన స్పిన్లర్లు...
భారత స్పిన్నర్లు రాణించడంతో సిడ్నీ టెస్టులో ఆసీస్ బ్యాట్ మెన్స్ కుప్పకూలిపోయారు. కుల్దీప్ యాదవ్ (3/71), రవీంద్ర జడేజా (2/62) మాయతో ఆస్ట్రేలియా కష్టాల్లో కూరుకపోయింది. ఏడో వికెట్‌కు పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌ (28, 91 బంతుల్లో 3 ఫోర్లు), పాట్‌ కమిన్స్‌ (25, 41 బంతుల్లో 6 ఫోర్లు) ధాటిగా ఆడారు. అజేయంగా 38 పరుగులు జోడించి, ఆసీస్‌ పతనాన్ని అడ్డుకున్నారు. వీరి జోడిని షమీ విడదీశారు. షమీ బౌలింగ్‌లో కమిన్స్ (25) పెవిలియన్ చేరాడు. కాసేపటికే హ్యాండ్స్ కాంబ్ (37) వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ జట్టు 89 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. క్రీజులో స్టార్క్ 7 పరుగులతో క్రీజులో నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, షమీ 2, జడేజా 2 వికెట్లు తీశారు. 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 622/7 డిక్లేర్డ్‌

Australia
trail
365 runs
2 wickets
remaining
innings
IND vs AUS
Live Score
Sydney
4th Test
kohli
Kuldeep Yadav
Jadeja

మరిన్ని వార్తలు