సిడ్నీ టెస్టు : ఫాలోఆన్‌లో ఆసీస్

Submitted on 6 January 2019
Australia trail by 316 runs with 10 wickets remaining | India tour of Australia at Sydney | 10TV

సిడ్నీ : భారత బౌలర్ల విజృంభణతో కంగారు తోక ముడిచేసింది. చివరి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ల ధాటికి ఆసీస్ 300 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 236/6 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్...20 ఓవర్లు ఆడి కేవలం 64 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్‌ని ముగించింది. వర్షం కారణంగా మూడు గంటలు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. 
300 వద్ద ఆలౌట్...
మ్యాచ్ ప్రారంభమైన ఆరు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టారు మన భారత బౌలర్లు. దీనితో ఆసీస్ బ్యాట్ మెన్స్‌‌పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. పైన్ (5), కుమిన్స్ (25), స్టార్క్ (29) పరుగులు చేశారు. చివరిలో క్రీజులో పాతుకపోయేందుకు హాజిల్ వుడ్ ప్రయత్నించాడు. కానీ అతని ప్రయత్నాన్ని యాదవ్ నిలువరించాడు. 300 స్కోరు వద్ద వుడ్‌ (21)ని అవుట్ చేశాడు. మొత్తంగా ఆసీస్ 104.5 ఓవర్లలో 300 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 
ఆసీస్ ఫాలో‌ఆన్...
అనంతరం రెండో ఇన్నింగ్స్‌ని భారత్ ప్రారంభించకుండా ఫాలో ఆన్ ఆడించాలని నిర్ణయం తీసుకుంది. ఆటను ఓపెనర్లు ప్రారంభించారు. కొద్దిసేపటికే వెలుతురు సరిగ్గా లేకపోవడంతో మ్యాచ్‌కి అంతరాయం కలిగింది. వికెట్ నష్టపోకుండా ఆసీస్ 6 పరుగులు చేసింది. 
సిరీస్ భారత్‌దే...
ఇక ఈ సిరిస్‌లో భారత్ ఓడిపోదని...విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కంగారులు మాత్రం అవుట్ కాకుండా క్రీజులో ఉంటే మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలున్నాయి. అయినా కూడా...ఇండియా 2-1 తేడాతో సిరిస్‌ని గెలుస్తుందని పేర్కొంటున్నారు. ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్‌ను గెలిపించిన తొలి భారత కెప్టెన్ గా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు. భారత బౌలర్లలో కుల్ దీప్ యాదవ్ 5 వికెట్లు, షమీ 2 వికెట్లు, జడేజా 2 వికెట్లు, బుమ్రా 1 వికెట్ తీశారు. 
భారత్ తొలి ఇన్నింగ్స్ : 622/7 డిక్లేర్డ్
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ : 300 రన్లు ఆలౌట్

Australia
trail
316 runs
10 wickets
remaining
india
Sydney

మరిన్ని వార్తలు