అనంతపురంలో ఆడమ్ గిల్ క్రిస్ట్

Submitted on 12 September 2019
Aussie cricketer Adam Gilchrist visits Anantapur

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ అనంతపురం వచ్చాడు. గురువారం అనంతపురంలో ఉన్న ఆర్డీటీ క్రికెట్ స్టేడియాన్ని సందర్శించాడు. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామానికి వెళ్తూ దారి మధ్యలో ఉన్న స్టేడియం పరిశీలించాడు. క్రీడాకారులకు అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నాడు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్డీటీ క్రికెట్ స్టేడియం బాగుందన్నాడు. భారత్‌లో క్రికెట్‌కు చక్కటి ప్రోత్సాహం అందుతుందన్నాడు. ప్రస్తుతం భారత క్రికెట్ మంచి ప్రదర్శన ఇస్తుందని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇతర జట్లపై టీమ్ స్ట్రైక్ అంతే భయంకరంగా ఉందని తెలిపాడు. 

ఈ పర్యటనలో ఆర్డీటీ ప్రోగ్రాం డైరక్టర్ మాంచో ఫెర్రర్ .. గిల్ క్రిస్ట్‌తో పాటుగా ఉన్నాడు. కర్నూలులోని పగిడిరాయి గ్రామంలో సోలార్ పవర్ స్టేషన్ పైలట్ ప్రాజక్ట్ లో భాగంగా గిల్ క్రిస్ట్ వచ్చాడు. గ్రామంలో సౌరశక్తి వినియోగం ఎలా జరుగుతుందోనని చూసేందుకు ఆసక్తితో అక్కడికి వచ్చినట్లు తెలిపాడు. 

Aussie cricketer
Adam Gilchrist
Anantapur
Andhra Pradesh
cricket
Australia

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు