ATMలో లూప్ హోల్: క్రేజీ బగ్ పెట్టాడు.. ఫ్రీగా పది లక్షలు కొట్టేశాడు

Submitted on 7 February 2019
ATM sofware programmer exploits atm loophole to withdraw over free 1 million in cash

ఏటీఎం మిషన్ లో డబ్బులు కొట్టేయాలంటే.. ఏటీఎంను పగలగొట్టి డబ్బులు దోచేయడం చూశాం. ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి కస్టమర్ల అకౌంట్లలో డబ్బులు కొట్టేయడం కూడా చూశాం. ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేశారంటే.. ఎంత తీసారు. ఎప్పుడు.. ఎక్కడ ఏ ఏటీఎం నుంచి తీసారో మొత్తం రికార్డు అయిపోతుంది. ప్రతి పనికి ఏదో ఒక లూప్ హోల్ (లొసుగు) ఉంటుంది. అదే బ్యాంకు ఏటీఎం ప్రొగ్రామర్ అయితే మిషన్ లో డబ్బులు కొట్టేయడం చాలా ఈజీ. ఎందుకంటే. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా కనిపెట్టలేరంటూరు. ఈ సామెతను అక్షరాల నిజం చేశాడో చైనాకు చెందిన ఏటీఎం సాఫ్ట్ వేర్ ప్రొగ్రామర్. గుట్టు చప్పుడు కాకుండా ఏటీఎంలో డబ్బులు కొట్టేసే లూప్ హోల్ వెతికాడు.


వెంటనే బ్యాంకు ఏటీఎంలో 1 మిలియన్ డాలర్లు (రూ. పది లక్షలు) విత్ డ్రా చేశాడు. ఏటీఎంలో విత్ డ్రా చేసిన పది లక్షలు మిషన్ లో రికార్డు కాలేదు. ఏటీఎం మిషన్ రన్ అయ్యే సాఫ్ట్ వేర్ లో క్రేజీ బగ్ ను సెట్ చేశాడు. అంతే.. రెండో కంటికి తెలియకుండానే ఏటీఎం మిషన్ నుంచి రాత్రికి రాత్రే లక్షల డబ్బు కాజేశాడు. 2016లో బీజింగ్ లోని హ్యూగ్జియా బ్యాంకులో ఏటీఎంలో ఈ ఘటన జరిగింది. ఈ భారీ రాబరీ కి స్కెచ్ వేసింది ఎవరో కాదు.. బ్యాంకు సాఫ్ట్ వేర్ చీఫ్ ఉద్యోగి ఖిన్ ఖిషేంగ్(43)గా గుర్తించినట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు నివేదించింది.

ఏడాదిగా విత్ డ్రా చేస్తున్నా..
గత ఏడాది నవంబర్ లో ఖిషేంగ్.. చైనీస్ బ్యాంకు ఏటీఎం సాఫ్ట్ వేర్ లో బగ్ స్ర్కిప్ ను యాడ్ చేశాడు. లూప్ హోల్ నుంచి ఈ బగ్ ను మిషన్ సాఫ్ట్ వేర్ లో ప్రొగ్రామ్ చేయడంతో ఇంటర్నెల్ సెక్యూరిటీ అలారం అలర్ట్ రికార్డు కాలేదు. అప్పటి నుంచి ఏడాదిగా ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తూనే ఉన్నాడు. 740 డాలర్లు నుంచి మొదలు పెట్టి 3వేల డాలర్లు వరకు విత్ డ్రా చేస్తూ వచ్చాడు. ఇలా ఏడాదికాలంలో 1 మిలియన్ డాలర్లు ఏటీఎం నుంచి విత్ డ్రా చేశాడు. ఈ మొత్తాన్ని తన సొంత అకౌంట్ నుంచి స్టాక్ మార్కెట్ లో ఇన్విస్ట్ చేసినట్టు నివేదిక తెలిపింది. 2016లో ఏటీఎంలో పెట్టిన ఈ బగ్ ను బ్యాంకు అధికారులు గుర్తించారు.


లూప్ హోల్ టెస్టింగ్ అంటూ మాయ చేసి..
ఇంటర్నెల్ సెక్యూరిటీ సిస్టమ్ ను టెస్టింగ్ చేస్తున్నట్టు మాత్రమే బ్యాంకు అధికారులకు తెలుసు. కానీ, కొట్టేసిన లక్షల సొమ్మును డమ్మీ అకౌంట్ లో దాచినంత కాలం ఇతగాడి గుట్టు బయటపడలేదు. ఎప్పుడైతే ఆ సొమ్మును తిరిగి తన అకౌంట్ లో ట్రాన్స్ ఫర్ చేసి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాడో అప్పుడే నిందితుడి బండారం బయటపడింది. బ్యాంకు రూల్స్ బ్రేక్ చేసి లక్షల రూపాయలు కొట్టేసింది ఖిషేంగ్ ఉద్యోగే అని తేలడంతో 43ఏళ్ల ఖిన్ కటకటలపాలయ్యాడు. దీంతో బీజింగ్ ఇంటర్మీడియట్ పీపుల్ కోర్టు నిందితుడు ఖిన్ కు.. 1 వెయ్యి 600 డాలర్ల జరిమానాతో పాటు ఏడాదిన్నర పాటు జైలు శిక్ష విధించింది.  

BANK
ATM
sofware programmer
loophole
cash withdraw

మరిన్ని వార్తలు