సినీ నటుడు దీక్షిత్ కన్నుమూత

Submitted on 18 February 2019
athadu cast deekshith died


సినీ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, డైరక్టర్ డి.యస్ దీక్షితులు కన్నుమూశారు. అతడు సినిమాలో సునీల్.. మహేశ్ బాబుతో కలిసి పూజారి ఇంటికి వచ్చే డైలాగ్ 'ఈడెవడో అర్ధరాత్రి నుంచి వచ్చి వాగుతున్నాడనుకోకపోతే.. మీకో విషయం చెప్పనా స్వామి. పిన్ని గారిని రోజూ ఆ తులసి కోటుకు పూజ చేయమని చెప్పండే..' అందరికీ గుర్తుండిపోతుంది. 

ఇటువంటి పాత్రలతో అతడులోనే కాకుండా మురారి, వర్షం, ఇంద్ర, ఠాగూర్, ప్రాణం చిత్రాల్లో కనిపించి మెప్పించారు. ఆయన ఇక లేరనే విషయం సినీ ఇండస్ట్రీలో విషాద చాయలు నింపింది. జూలై 28వ తేదీ 1956వ సంవత్సరంలో హనుమంతాచార్యులు, సత్యవతమ్మ దంపతులకు జన్మించారు. 

సినీ పరిశ్రమతో పాటు రంగస్థల నటుడిగానూ, అధ్యాపకుడిగానూ మంచి పేరు పొందారు. తెలుగు భాషలోనే కాక, సంస్కృత భాషలోనూ ప్రావీణ్యమున్న ఈయన స్టేజ్ నాటకాల్లో ఎంఏ డిగ్రీలు పొందాడు. 

Cinema
telugu cinema

మరిన్ని వార్తలు