వీళ్లందర్నీ ఒకేస్టేజ్ మీద ఆడిస్తున్న ఆ సూత్రధారి ఎవరు? ఆసక్తి రేపుతున్న ‘అశ్వథ్థామ’ ట్రైలర్

Submitted on 23 January 2020
Aswathama Trailer (4K ULTRA HD)

యంగ్ హీరో నాగశౌర్య, మెహరీన్ జంటగా, రమణ తేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో.. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించిన యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘అశ్వథ్థామ’.. ఈ సినిమాకు నాగశౌర్య కథనందించడం విశేషం. గురువారం సాయంత్రం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చేతుల మీదుగా విడుదలైంది.

Image

‘రాక్షసుణ్ణీ, భగవంతుణ్ణీ చూసిన కళ్లు.. ఇక ఈ ప్రపంచాన్ని చూసే అర్హత కోల్పోతే’.. అనే డైలాగుతో స్టార్ట్ అయిన ‘అశ్వథ్థామ’ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కొందరు జాలర్లు అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడం, హీరో వాళ్లని పట్టుకోవడానికి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విశ్వ ప్రయత్నాలు చేయడం.. ‘ఆడపిల్ల చావు మీద మీకెందుకు బాబు అంత ఇంట్రెస్టు.. దాని మీద వంద కథలు, వెయ్యి పుకార్లు పుట్టించేదాకా మీకు నిద్ర పట్టదే’ అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది.

Read Also : ‘83’ తెలుగులో కింగ్-తమిళ్‌లో కమల్

Image

‘ఎటు వెళ్లినా మూసుకుపోతున్న దారులు.. ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తులు.. వేట కుక్కలాగా వెంటపడే జాలర్లు.. శకుని లాంటి ఒక ముసలోడు.. వీళ్లందర్నీ ఒకేస్టేజ్ మీద ఆడిస్తున్న ఆ సూత్రధారి ఎవరు’?.. అంటూ నాగశౌర్య చెప్పిన డైలాగుని బట్టి కాన్సెప్ట్ ఏంటనేది కాస్త క్లూ ఇచ్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 31న ‘అశ్వథ్థామ’ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సంగీతం : శ్రీ చరణ్ పాకాల, బ్యాగ్రౌండ్ స్కోర్ : గిబ్రాన్. 

Image

Naga Shaurya
Mehreen
Ira Creations
Ramana Teja

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు