కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడగటం కరెక్ట్ కాదు  : కిషన్ రెడ్డి  

Submitted on 17 November 2019
Asking for national status for Kaleshwaram project is not correct: Kishan Reddy

కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేననీ..ఒక రాష్ట్రాన్ని ఎక్కువగా మరో రాష్ట్రాన్ని తక్కువగా చూడదని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగే స్వేచ్ఛ ఆ రాష్ట్ర ఎంపీలకు ఉందని అంటూనే..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి..ఓ కార్పొరేషన్ పెట్టుకుని  కేంద్రం నుంచి నిధులు తెచ్చుకున్నారనీ..మళ్లీ జాతీయ హోదా అడగటం కరెక్ట్ కాదన్నారు.
    
కాళేశ్వారానికి జాతీయ హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ..ఎక్కడా చెప్పలేదన్నారు. పునర్విభజన చట్టంలోని అన్ని అంశాలపై చర్చించేందుకు కేంద్రం ఎప్పుడూ సిద్ధంగానే ఉందని తెలిపారు.  శాంతి భద్రతల విషయంలో రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటు పాలన సాగిస్తున్నామన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామనీ.. ఉగ్రవాదులను మట్టుపెట్టటానికి  కఠినంగా వ్యవహరిస్తున్నామని కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ సింగ్ 10టీవీతో అన్నారు. 

Telangana
Kaleshwaram
Project
national status
Minister
Kishan Reddy

మరిన్ని వార్తలు