గాసిప్ కాదు నిజం : ఈ హీరో, హీరోయిన్ పెళ్లి

Submitted on 14 February 2019
Arya&Sayyeshaa Getting Married This March-10TV

తమిళ యంగ్ హీరో ఆర్య, హీరోయిన్ సాయేషా సైగల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి.. కానీ, ఈ వార్తల గురించి ఆర్య, సాయేషా ఎవరూ రెస్పాండ్ అవలేదు.. ఇప్పడు మేమిద్దరం పెళ్ళి చేసుకోతున్నాం అంటూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందీ జంట.. ప్రేమికుల రోజున తమ ప్రేమ, పెళ్ళి గురించి చెప్తూ, ఒక గ్రీటింగ్ లాంటిది పోస్ట్ చేసారు. మా పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ బ్లెస్సింగ్స్‌తో, మేమిద్దరం మార్చిలో మ్యారేజ్ చేసుకోబోతున్నాం.. మా, ఈ న్యూ జర్నీ హ్యాపీగా సాగాలని ఆశీర్వదించండి.. అంటూ, ఫ్యాన్స్ అందరికీ వాలెంటైన్స్ డే విషెస్ చెప్పారు ఆర్య, సాయేషా.. 

 

సాయేషా, అఖిల్ సినిమాతో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయ్యింది.. ఈమె బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ మనవరాలు.. గజినీకాంత్ అనే తమిళ్ మూవీ షూటింగ్ టైమ్‌లో ఆర్య, సాయేషా లవ్‌లో పడ్డారు.. (నాని భలే భలే మగాడివోయ్ రీమేక్).. ఇప్పడు పెద్దల అంగీకారంతో పెళ్ళి పీటలు ఎక్కబోతున్నారు.

వాచ్ గజినీకాంత్ ట్రైలర్...

Arya
Sayyeshaa
Arya&Sayyeshaa Wedding
Arya&Sayyeshaa Getting Married This March

మరిన్ని వార్తలు