చెన్నైలో ఆర్య‌-సాయేషా రిసెప్ష‌న్‌ వేడుకలు

Submitted on 15 March 2019
Arya and Sayesha Saigal Wedding Reception at Chennai

న్యూ క‌పుల్ ఆర్య-సాయేషాలు మార్చి 10న హైద‌రాబాద్‌లో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే దీనికి ఎవ‌రూ పెద్ద న‌టులు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అల్లు అర్జున్, విశాల్ లాంటి ఒక‌రిద్ద‌రు త‌ప్ప మ‌న ఇండ‌స్ట్రీ నుంచి ఎవ‌రూ అక్క‌డ క‌నిపించ‌లేదు. ఇక నిన్న సాయంత్రం చెన్నైలో గ్రాండ్ రిసెప్ష‌న్ జ‌రుపుకున్నారు. ఈ రిసెప్ష‌న్ వేడుక‌కి కోలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. 
Read Also: క్రికెటర్ షమీకి షాక్ : గృహహింస కింద చార్జిషీట్

ఇక రిసెప్ష‌న్ కోసం ప్ర‌త్యేకంగా ఫోటోషూట్ కూడా చేసారు ఆర్య‌, స‌యేషా. రిసెప్ష‌న్ వేడుక‌కి సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతున్నాయి. వరుడు , సైజ్ జీరో, ఒక రాజు ఒక రాణి వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా ద‌గ్గ‌ర‌య్యాడు హీరో ఆర్య‌(38). ఇక అఖిల్ అనే చిత్రంతో టాలీవుడ్ అభిమానుల‌ని ప‌ల‌క‌రించిన‌ స‌యేషా సైగ‌ల్‌(21) హిందీ, త‌మిళంలో ప‌లు చిత్రాలు చేసింది.

2018లో వ‌చ్చిన గ‌జినీకాంత్ అనే చిత్రంలో ఆర్య‌, సాయేషా క‌లిసి న‌టించారు. ప్ర‌స్తుతం సూర్య‌-కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న క‌ప్పం చిత్రంలో న‌టిస్తున్నారు. ఇందులో మోహ‌న్ లాల్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. మొత్తానికి కొన్ని రోజుల త‌ర్వాత మ‌ళ్లీ ఎవ‌రి సినిమాల‌తో వాళ్లు బిజీ కాబోతున్నారు ఈ జంట‌.
Read Also: ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి 14 సంవ‌త్స‌రాలు..అనుష్క

Arya and Sayesha Saigal
Wedding Reception
Chennai
2019

మరిన్ని వార్తలు