ఉగ్రదాడిలో ఎమ్మెల్యేతో సహా 11మంది మృతి

Submitted on 21 May 2019
Arunachal Pradesh MLA gunned down by militants

 

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. నేషనల్ పీపుల్స్ పార్టీకి ఎమ్మెల్యేని ఉగ్రవాదులు హత్య చేశారు. తిరప్ జిల్లా.. కోన్సా వెస్ట్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే తిరోంగ్ అబో(42)ను మిలిటెంట్ గ్రూపు దాడి చేసి చంపేసింది. ఈ ఘటనలో తిరోంగ్ అబోతో పాటు, ఆయన కుమారుడు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది సహా మొత్తం 11 మంది చనిపోయారు. 
అయితే దాడి తాము చేశామంటూ ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. ఈ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. అయితే ఈ దాడిని నాగా మిలిటెంట్లు చేసినట్లు అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  నేషనల్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మేఘాలయా ముఖ్యమంత్రి కోన్రాడ్ కె. సంగ్మా సైతం ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.
42ఏళ్ల అబో కొన్సా వెస్ట్ నియోజకవర్గం నుంచి 2014లో పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ తరుపున గెలిచాడు. అయితే గతేడాది జులైలో మరో ఆరుగురు పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ సభ్యులతో కలిసి పార్టీ మారారు.  

Arunachal Pradesh MLA
Militants
gunned down

మరిన్ని వార్తలు