ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ-ఒంగోలు

Submitted on 22 May 2019
Army Recruitment Rally Ongole 

జోనల్ రిక్రూట్మెంట్ ఆఫీస్ చెన్నై. ఆర్మీ రిక్రూట్ మెంట్ ఆఫీసు గుంటూరు వారి ఆధ్వర్యంలో 05-జులై-2019 నుంచి 15-జులై -2019 వరకు ఒంగోలు లోని పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ లో ఏడు జిల్లాల (అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప,కర్నూలు,నెల్లూరు, ప్రకాశం) అభ్యర్ధులకు ఆర్మీలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి  రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. 

పోస్టులు-రకాలు
1.సోల్జర్ టెక్నీకల్ (ఏవియేషన్/అమ్యూనిషన్ ఎగ్జామినర్)
2.సోల్జర్ జనరల్ డ్యూటీ
3.సోల్జర్ ట్రేడ్ మెన్
4.సోల్జర్ క్లర్క్(స్టోర్ కీపర్/టెక్నికల్)
5.సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్
6,నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ
7.సోల్జర్ ట్రేడ్ మెన్ 10వ తరగతి 
8.సోల్జర్ ట్రేడ్ మెన్ 8వ తరగతి 

అర్హత :  పోస్టులను బట్టి 8 వతరగతి,10వతరగతి, 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ,మ్యాధ్స్)ఉత్తీర్ణత
వయస్సు : కొన్ని పోస్టులకు 17 ఏళ్ళ 6 నెలల నుంచి 21 ఏళ్లు, మరికొన్ని పోస్టులకు  17 ఏళ్ళ 6 నెలల నుంచి 23 ఏళ్ళు ఉండాలి.
ఎంపిక విధానం : ఫిజికల్ ఫిట్ నెస్, ఫిజికల్ మెజర్ మెంట్  టెస్ట్, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుకు చివరి తేదీ : 16-జూన్-2019 వరకు

పూర్తి వివరాలకు :www.joinindianarmy.nic.in
http://joinindianarmy.nic.in/Alpha/writereaddata/Portal/BRAVO_NotificationPDF/Rally_Notification__Ongole.pdf

jobs
army
recruitment
ongole
guntur
Chennai
 

మరిన్ని వార్తలు