బీఅలర్ట్ : డిజిటల్ వ్యసనమా.. మీ జీవితం నాశనమే!

Submitted on 6 December 2019
Are You Sign of digital addiction, How to tell if your addiction is ruining your life

మనుషులతో మాట్లాడే రోజులు పోయాయి. ఇదో డిజిటల్ యుగం. అంతా ఆన్ లైన్‌లోనే మాట్లాడేది. జనజీవనంలోకి స్మార్ట్ ఫోన్ ప్రవేశించాక అంతా ఫోన్లతోనే గంటల కొద్ది గడిపేస్తున్నారు. క్షణం స్మార్ట్ ఫోన్ స్ర్కీన్ చూడకుండా ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. ఆఫ్‌లైన్ అనుబంధాలు అక్కర్లేదు.అన్నీ ఆన్ లైన్ బంధాలే.

స్నేహితులు, బంధువులను కలిసి సరదాగా మాట్లాడుకునే సమయం కూడా దొరకడం లేదు. అంతగా ఫోన్లతో బిజీ లైఫ్‌గా మారిపోయింది. ఎవరితో మాట్లాడాలన్నా ఫోన్లలోనే. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన ఈ ఆధునిక కాలంలో స్మార్ట్ ఫోన్లతోనే కాలాన్ని వెల్లదీస్తున్నారు. ఫలితంగా స్నేహపూర్వక సంబంధాలు దెబ్బతింటున్నాయి.

రోజుకు ఎన్నోసార్లు ఫోన్ చూస్తున్నారు :
మీరు డిజిటల్ అడిక్షన్ (వ్యసనం)తో బాధపడుతున్నారా? అదేలా గుర్తించాలో తెలియదా? మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? ప్రతిరోజు మీ ఫోన్ స్ర్కీన్ ఎన్నిసార్లు టచ్ చేస్తున్నారు. ఒకవేళ రోజుకు 2,600 సార్లు కంటే ఎక్కువగా ఫోన్ స్ర్కీన్ టచ్ చేస్తుంటే.. మీరు డిజిటల్ వ్యసనానికి గురయినట్టే. అంటే... మీరు ఎప్పుడైనా ఫోన్ ఎక్కడైనా పెట్టి మరిచిపోయారా? ఆ సమయంలో మీరు ఎలా రియాక్ట్ అయ్యారు.. భయపడ్డారా? కలవరపాటుకు గురయ్యారా? దీన్నే ‘ఫ్యాంటామ్ వైబ్రేషన్ సిండ్రోమ్’ అని అంటారు. ఫోన్లో ఒక మెసేజ్ అలర్ట్ రాగానే కంగారుగా ఏంటా ఓపెన్ చేసి చెకింగ్ చేస్తున్నారా? అయితే మీ జీవితాన్ని నాశనం చేస్తోందని గ్రహించండి.

కొన్ని వాస్తవిక సందర్భాల్లో కూడా దీని ప్రభావం తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది. ఉదాహరణకు.. మీరు అదే పనిగా ఫోన్ స్ర్కీన్ చూస్తూ ఉండి.. ఇతరులతో మాట్లాడం మానేసి.. సమాధానం చెప్పకుంటే మాత్రం.. వారు వ్యక్తిగతంగా తీసుకుని మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఏదైనా పని చేసే సమయంలో బ్రేక్ ఇచ్చి మీ సెల్ ఫోన్ చూస్తున్నారా? మీరు చేసే పనిపై ఏకాగ్రతను దెబ్బతిస్తుంది జాగ్రత్త. ఇలాంటి అంధకూపాల నుంచి ఎలా దూరంగా ఉండాలి? అవసరమైన ప్రయోజనాలను సొంతం చేసుకోవాలి అనేదానిపై దృష్టిసారించాలి.

ఫోన్ స్ర్కీన్లు.. ఎలా ప్రభావితం చేస్తాయంటే? :
మనుషులతో నేరుగా స్పందించకుండా ఫోన్, కంప్యూటర్ స్ర్కీన్ల ద్వారా స్పందించేవారిపై ఏ మేరకు ప్రభావం ఉంటుందో టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ రీసెర్చర్ ఒకరు తన అనుభవాన్ని వివరించారు. ఫేస్-టూ-ఫేస్, ఫోన్ స్ర్కీన్, రాయడం సహా ఇతర మార్గాల్లో స్పందన నుంచి ఎలాంటి స్ర్కీన్ల ద్వారా స్పందన భిన్నంగా ఉంటుంది అనేదానిపై కనీసం రెండు దశబ్దాలుగా పరిశోధించినట్టు చెప్పుకొచ్చారు.

దీనికి సంబంధించి తన పరిశోధక బృందం ఒక అధ్యయనాన్ని రూపొందించినట్టు తెలిపారు. ఈ పరిశోధనలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది అబద్దాలు చెప్పినట్టు గుర్తించామన్నారు. మరికొంతమంది నెగిటీవ్ (లోయిర్ ఫీడ్ బ్యాక్ రేటింగ్స్) ఇవ్వగా, కొంతమంది పెద్దగా సహకరించేలేదన్నారు.

ఐదేళ్ల లోపు పిల్లల్లోనే ఎక్కువ :
ఎవరూ కచ్చితమైన అభిప్రాయాన్ని చెబుతారా? అని చూస్తుండగా.. డిజిటల్ అంటే.. అదొక కమ్యూనికేషన్ అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఐదేళ్ల లోపు పిల్లల్లో డిజిటల్ ప్రభావం.. వారి మెదడు అభివృద్ధి విషయంలో ప్రమాదకరమైనదిగా పరిగణించినట్టు తెలిపారు. ఫోన్ స్ర్కీన్ ఎక్కువ సమయం చూసే వారిలో చిన్నారులే పెద్ద మొత్తంలో ప్రభావానికి గురికావడం భయాందోళనకు గురిచేస్తోందని పరిశోధక బృందం చెబుతోంది.

చిన్నారుల్లో ఎక్కువగా ప్రభావితమయ్యే స్థానాల్లో మానసిక ఆరోగ్యం, వ్యసనం, తమ వైపు ఏం జరుగుతుందో గ్రహించలేకపోవడం వంటి ఈ మూడే ప్రమాద స్థాయిలో ఉన్నట్టు తెలిపారు. ప్రత్యేకించి టీనేజర్లలో సెల్ ఫోన్, మానసిక ఒత్తిడి మధ్య సంభావ్యత సంబంధాలు చాలానే ఉన్నాయి.

వీడియో గేమ్స్‌ వ్యసనమే: పరిష్కారం ఇదిగో
డిజిటల్ వ్యసనానికి మూల కారణం.. సైకాలజీ పరంగా చూస్తే వీడియో గేమ్ వ్యసనమని గుర్తించారు. ఈ సమస్యను సులభంగా నిర్ధారించవచ్చు. దీనికి పరిష్కారం ఒకటే ఉంది. ముందుగా చిన్నారులను తమ స్నేహితులతో కలిసి మెలిగే వాతావరణం కల్పించాలి. పెద్దలతో కలిసి మంచి విషయాలు తెలుసుకునేలా ప్రోత్సహించాలి. తల్లిదండ్రులే ఇందులో కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అప్పుడే పిల్లల్లో మానసిక ఎదుగుదలకు ఎలాంటి సమస్య ఉండదు. నిద్రలేమి సమస్యలు క్రమంగా తొలిగిపోతాయి కూడా.

మీ పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి :
ప్రతిఒక్కరూ రోజు రాత్రి నిద్రపోయే ముందు సెల్ ఫోన్ వాడకూడదని గట్టిగా నిర్ణయించుకోండి. వాహనం నడిపే సమయంలో కావొచ్చు లేదా వీధులు దాటే సమయంలో కావొచ్చు.. ఒకవేళ మీ పిల్లలు ఫోన్ స్ర్కీన్ ఎక్కువ సమయం చూస్తున్నారంటే.. వారిపై ఓ కన్నేసి ఉంచండి. వారికి ఏదైనా పని చెప్పండి లేదా వారితో ఏదొక అంశంపై చర్చించండి. అప్పుడు వారిలో మార్పు మొదలవుతుంది.

ఈ విషయంలో కొన్ని టూల్స్, యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీ పిల్లలు స్ర్కీన్ ఎంత సేపు చూస్తున్నారో ట్రాక్ చేయవచ్చు. డిజిటల్ పరంగా లేదా బయట మంచి అలవాట్లు అలవర్చుకునేలా చూడాలి. కానీ, మన జీవితంలో ఫోన్లు ఇతర మార్గాల్లో ఎంతవరకు ప్రభావితం చేస్తాయి అనేదానిపై స్పష్టంగా చెప్పలేమంటున్నారు పరిశోధకులు.

digital addiction
Life
friendships
video game addiction
kids
spent on screens
mental health
addiction
online games

మరిన్ని వార్తలు