ఐఫోన్లు ఇక చౌకేనా? : ఇండియాలో భారీగా ఐఫోన్ల ఉత్పత్తి!

Submitted on 15 April 2019
Apple iPhone mass production to start in India soon : Report

2019 ఏడాదిలో ఇండియాలో ఆపిల్ ఐఫోన్ల భారీగా ఉత్పత్తి ప్రారంభం కానుంది. అందిన నివేదిక ప్రకారం.. థైవాన్ కంపెనీ ఫాక్స్ కాన్ టెక్నాలజీ గ్రూపు చైర్మన్ టెర్రీ గౌ ఐఫోన్ల ఉత్పత్తికి భారత దేశంలో లైన్ క్లియర్ అయినట్టు తెలిపారు. అతిపెద్ద అసెంబ్లర్ గా పేరుగాంచిన ఆపిల్ ఇంక్ హ్యాండ్ సెట్ల ఉత్పత్తిపై ఇప్పటివరకూ చైనాపైనే ఫాక్స్ కాన్ దృష్టిసారించింది. ఇండియాలో థైవాన్ కంపెనీ ఐఫోన్ల విస్తరణ ప్లాన్ పై ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ తనను భారత్ కు ఆహ్వానించినట్టు టెర్రీ చెప్పారు. కొన్ని ఏళ్ల నుంచి బెంగళూరులో పాత ఐఫోన్ల తయారీ ప్లాంట్ మాత్రమే ఉంది. కానీ, ఇప్పటి నుంచి కొత్త ఆపిల్ ఐఫోన్ మోడళ్ల ఉత్పత్తిని విస్తరించే దిశగా ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.

ఇండియాలో లేటెస్ట్ ఐఫోన్లపై ట్రయల్ ప్రొడక్షన్ ప్రారంభించనున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో ఇండియా స్మార్ట్ ఫోన్ల పరిశ్రమలో ఫాక్స్ కాన్ కీలక పాత్ర పోషించనున్నట్టు టెర్రీ గౌ ఆశాభావం వ్యక్తం చేశారు. చైనాతో పాటు ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ల మార్కెట్ అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నదేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. 2018లో ఇండియా స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో  142.3 మిలియన్ల యూనిట్లకు పైగా స్మార్ట్ ఫోన్లు దిగుమతి అయినట్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో రీసెర్చ్ సంస్థ ఐడీసీ వెల్లడించింది.

2017తో పోలిస్తే ఏడాదికి ఏడాదికి 14/5 శాతం పెరుగుతోందని తెలిపింది. ఇండియాలో అతి చౌకౌన స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండగా.. స్వదేశంలో ఆపిల్ తమ ఐఫోన్ల కొత్త మోడళ్ల ఉత్పత్తి చేస్తే.. ఐఫోన్ల ధర కూడా తగ్గే అవకాశం కనిపిస్తోంది. చైనా మొబైల్ మేకర్ షియోమీ వంటి ఎన్నో మొబైల్ తయారీ సంస్థలు తమ స్మార్ట్ ఫోన్లను ‘మేడ్ ఇన్ ఇండియా’ఉత్పత్తి చేయడం మొదలుపెట్టేశాయి. మరో నివేదికలో రానున్న నెలల్లో ఫాక్స్ కాన్ చైర్మన్ టెర్రీ గౌ కంపెనీకి వీడ్కోలు పలుకుబోతున్నట్టు తెలిపింది.

కంపెనీ అభివృద్ధికి యువత టాలెంట్ ఎంతో అవసరమని, వారికి అవకాశం ఇచ్చేందుకు తాను వైదొలుగబోతున్నట్టు నివేదిక పేర్కొంది. 1974లో ఫాక్స్ కాన్ గ్రూపును స్థాపించారు. అప్పటినుంచి ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ మ్యానిఫ్యాక్షర్ కంపెనీగా ఏడాదికి 168.52 బిలియన్ డాలర్లు రెవెన్యూ వస్తోంది. ఫాక్స్ కాన్ కంపెనీ అందించే అసెంబుల్ ప్రొడక్టుల్లో ఆపిల్, సాఫ్ట్ బ్యాంకు గ్రూపు కార్పొరేషన్, ఇతర గ్లోబల్ టెక్ సంస్థలకు సంబంధించిన ప్రొడక్టులు ఉన్నాయి. 

Apple iPhone
mass production
India soon
Foxconn chairman
PM Modi      


మరిన్ని వార్తలు