ఏపీ ఎంసెట్‌ : ఫిభ్రవరి 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ 

Submitted on 10 February 2019
APEAMCET : Admission of applications from February 26

అమరావతి : ఏపీ ఎంసెట్‌-2019 పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌ఎస్‌.సాయిబాబు విడుదల చేశారు. నోటిఫికేషన్‌ను ఫిభ్రవరి 20న విడుదల చేయనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 26న ప్రారంభం కానుంది. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ మార్చి 27. అపరాధ రుసుము రూ.500తో దరఖాస్తుకు ఏప్రిల్‌ 4, రూ.1000 అపరాధ రుసుముతో ఏప్రిల్‌ 9, రూ.5 వేలు అపరాధ రుసుముతో ఏప్రిల్‌ 14 చివరి గడువులుగా నిర్ణయించారు. 

  • ఏప్రిల్‌ 16 : వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్‌ 
  • ఏప్రిల్‌ 19 : రూ.10 వేల అపరాధ రుసుముతో దరఖాస్తు సమర్పణకు చివరి గడువు 
  • ఏప్రిల్‌ 20 నుంచి 23 వరకు : ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష
  • ఏప్రిల్‌ 23, 24 : వ్యవసాయ ప్రవేశ పరీక్ష 
  • ఏప్రిల్‌ 22, 23 : ఇంజినీరింగ్‌, వ్యవసాయం రెండు పరీక్షలు 
  • పరీక్షల సమయం : ఉ.10 నుంచి మ. ఒంటి గంట వరకు, సా.2.30 నుంచి 5.30 వరకు
  • ఫలితాల విడుదల : మే 5న
     
APEAMCET : Admission of applications
February 26
guntur

మరిన్ని వార్తలు