వరంగల్
Saturday, March 18, 2017 - 18:36

వరంగల్ : సామాజిక తెలంగాణ, సమగ్ర అభివృద్ధి నినాదంతో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఆధ్వర్యంలో చేపట్టిన సుదీర్ఘ మహాజన పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 19న హైదరాబాద్‌లో జరగనున్న 'సర్వసమ్మేళన సభ'ను జయప్రదం చేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. 
ముగింపు దశకు సీపీఎం మహాజన పాదయాత్ర  
తెలంగాణ...

Saturday, March 11, 2017 - 18:38

హైదరాబాద్: రియల్‌ ఎస్టేట్‌ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా లెక్కకు మించి వెంచర్లను పూర్తి చేసుకుని ఎందరో కష్టమర్ల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న సంస్థ సుఖీభవ ప్రాపర్టీస్‌. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా హైదరాబాద్-వరంగల్‌లో కొత్త వెంచర్లతో ముందుకు దూసుకుపోతున్నారు. ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 7వ వెంచర్‌ రాయల్‌ నివాస్‌. ఈ వెంచర్‌కు సంబంధించిన మరిన్ని...

Saturday, March 11, 2017 - 07:33

వరంగల్‌ : శివారు ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వంచనగిరిలో ఉన్న గోడౌన్‌లో మంటలు చెలరేగి పత్తి బేళ్లు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Sunday, March 5, 2017 - 15:52

వరంగల్ : తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడలు వ‌రంగ‌ల్ న‌గ‌రంలో ఉత్సహంగా సాగుతున్నాయి. క‌రీమాబాద్ రంగ స‌ముద్రంలో నిర్వహించిన ప‌డ‌వ‌ల పోటీల‌ను సీపీ సుధీర్ బాబు ప్రారంభించారు.  డ‌బుల్, సింగిల్స్ విభాగాల్లో పోటీల‌ను నిర్వహించారు. ఈ పోటీల‌ను తిల‌కించేందుకు నగ‌ర వాసులు పెద్దసంఖ్యలో తరలిచ్చారు. జిల్లా కలెక్టర్ అమ్రపాలితో పాటు సీపీ సుధీర్‌బాబు ప‌డ‌వపై కాసేపు విహ‌రించారు. 

Sunday, March 5, 2017 - 11:46

ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగి..ఆ తరువాత ఏదో సాధించాలనే తపనతో బయటకు వచ్చి ఒక చిన్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా తన కెరీర్ ను ప్రారంభించి నేడు స్టెర్లింగ్ పంప్స్ సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్ గా ఎదగడమే కాకుండా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈయన ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేగాకుండా సమాజానికి తనవంతు కృషి చేయాలన్న ఆలోచనతో తన తండ్రి పేరిట ఒక మెమోరీయల్ ట్రస్టును స్థాపించి ఎంతో మందికి...

Saturday, March 4, 2017 - 19:36

వరంగల్ : వరంగల్‌ మహానగరపాలక సంస్థ బడ్జెట్‌ను కౌన్సిల్‌ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. మొదటిసారి వెయ్యి 43కోట్ల రూపాయలతో బడ్జెట్‌ రూపకల్పన చేశామని మేయర్‌ నరేందర్‌ తెలిపారు. నగరవాసులపై పన్నుభారం లేకుండా బడ్జెట్‌ తయారుచేశామని స్పష్టం చేశారు. బల్దియా కౌన్సిల్‌ హాల్‌లో ఏర్పాటైన బడ్జెట్‌ సమావేశానికి ఎంపీ దయాకర్‌... ఎమ్మెల్యే వినయ భాస్కర్‌ హాజరయ్యారు.

Saturday, March 4, 2017 - 18:47

వరంగల్ : అటు బడ్జెట్‌ అద్భుతంగా ఉందని టీఆర్ ఎస్ నేతలు ప్రశంసిస్తుంటే... ప్రజాసంఘాలు మాత్రం అశాస్త్రీయంగా ఉందని ఆరోపిస్తున్నాయి.. బడ్జెట్‌ రూపకల్పన తప్పులతడకగా ఉందంటూ వరంగల్‌ మేయర్‌ చాంబర్‌ దగ్గర ధర్నా చేపట్టారు.. పన్నుల్ని భారీగా పెంచారని మండిపడ్డారు.. పన్నుల పెంపులేకుండా బడ్జెట్‌ తయారు చేయాలని డిమాండ్ చేశారు..

Thursday, March 2, 2017 - 17:14

వరంగల్ : చేనేతల అభివృద్దికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రాష్ట్ర డిప్యూటి సీఎం కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. పరకాలలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రారంభించి ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వలసలు వెళ్లిన వారిని తిరిగి రాష్ట్రానికి రప్పిస్తామన్నారు. వరంగల్ జిల్లాలో 1200 ఎకరాల స్థలంలో టెక్స్ టైల్ పార్కును నిర్మించబోతున్నట్లు...

Wednesday, March 1, 2017 - 20:47
Tuesday, February 28, 2017 - 07:18

తెలుగు రాష్ట్రాల్లో మార్చి 1వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనపథంలో 'మ్యాథ్స్ పేపర్ లో టాప్ స్కోరు సాధించడం ఎలా' ? దానిపై జి.వి.రావు విద్యార్థులకు సలహాలు..సూచనలు అందచేశారు. మరి ఆయన ఎలాంటి సలహాలు..సూచనలు అందచేశారో వీడియోలో చూడండి.

Pages

Don't Miss