విజయనగరం
Thursday, March 15, 2018 - 07:12

విజయవాడ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది... మార్చి 15 నుంచి 29వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వీఎంసీ పరిధిలోని పాఠశాలల్లో మాత్రం జంబ్లింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలోని పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు....

Saturday, March 10, 2018 - 19:06

విజయనగరం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్టు వైసీపీ నేతలు నటిస్తున్నారని మంత్రి సుజయ కృష్ణరంగారావు విమర్శించారు. రాష్ట్ర విభజనకు ఆనాడు సహకరించిన బొత్ససత్యనారాయణ.. ఏపీ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకున్న టీడీపీపై విమర్శలు చేస్తున్నారని మంత్రి ఎద్దేవాచేశారు. బీజేపీతో కలిసి సాగేందుకు వైసీపీ ఆరాటపడుతోందని.. మంత్రి సుజయకృష్ణ రంగారావు అన్నారు.

Monday, February 12, 2018 - 15:19

విజయనగరం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై తాను స్పందించలేనని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...బడ్జెట్ పై చర్చ జరుగుతోందని..కమిటీలు అధ్యయనం చేస్తున్నాయని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు టెండర్లను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించడం జరిగిందని, ఎయిర్ పోర్టు ఆదాయ..ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు ఈ నిర్ణయం...

Friday, February 9, 2018 - 15:23

విజయనగరం : జిల్లా నెల్లిమర్ల జూట్‌ మిల్లు యాజమాన్యం వేధింపులకు రెడ్డి గురునాయుడు అనే కార్మికుడు బలయ్యాడు. తమ స్థలంలో ఇల్లు కట్టుకున్నాడని గురునాయుడిని మిల్లు యాజమాన్యం వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. తెల్లకాగితంపై సంతకాలు తీసుకుని ఇల్లు ఖాళీ చేయమని బెదిరించడంతో మనో వేదనకు గురైన గురునాయుడు మరణించాడు. గురునాయుడు మృతికి మిల్లు యాజమాన్యమే కారణమంటూ మృతదేహంతో కార్మికులు...

Thursday, February 8, 2018 - 15:13

విజయవాడ : విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వామపక్షాలు చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్‌కు వైసీపీ, ప్రజా సంఘాల పూర్తి మద్దతు పలికాయి. నగరంలోని విద్యాసంస్థలు, దుకాణాలు మూతపడ్డాయి. విభజన హామీలు .. బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించే వరకు పోరాటాలు ఆపమంటున్న వామపక్షాలు, వైసీపీ, కాంగ్రెస్ నేతలతో టెన్ టివి ముచ్చటించింది.

ఒంగోలు......

Wednesday, February 7, 2018 - 19:21

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా..తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ లో ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి మోడీ ఏపీకి ఎలాంటి హామీలు గుప్పించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో వామపక్షాలు ఏపీ బంద్ కు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్ సంఘీభావం తెలుపగా..వైసీపీ బంద్ కు మద్దతినిచ్చింది. జనసేన కూడా...

Tuesday, January 30, 2018 - 19:37

విజయనగరం : కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాల కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా విజయనగరంలో జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టారు. సీఐటీయూ, ఏఐటీయూసీల ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయాన్ని ముట్టడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను తుంగలో తొక్కుతున్నాయని కార్మిక నేతలు విమర్శించారు. కాగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 

Pages

Don't Miss