విశాఖ
Monday, September 18, 2017 - 19:35

విశాఖపట్టణం : నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ...అదే రెట్టింపు ఉత్సాహంతో మరో ఎన్నికకు సిద్ధం అవుతుంది. మరోవైపు ఓటమి నైరాశ్యం నుండి బయటపడి రానున్న ఎన్నికలకు ప్రజలను కార్యకర్తలను సిద్ధం చేసేపనిలో పడింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. అయితే త్వరలో విశాఖలో రానున్న జీవీఎంసీ ఎన్నికలకు ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నద్దం అవుతున్నాయి.

నంద్యాల,...

Monday, September 18, 2017 - 08:15

 

విశాఖ : జిల్లా కేంద్రంలో జరిగిన ప్రాంతీయ పర్యావరణ సదస్సు ముగిసింది. ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిక్షణ, కాలుష్య నియంత్రణ, పారిశ్రామిక వ్యర్థాలు నదుల్లో కలవకుండా చూడ్డానికి తీసుకోవాల్సిన చర్యలు.. వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. చర్చల వివరాలతో నివేదిక రూపొందించి అమలు కోసం కేంద్ర, రాష్ట్రాలకు పంపాలని నిర్ణయించారు. ఏపీలో పర్యావరణ పరిరక్షణకు అత్యుత్తమ ప్రమాణాలు...

Sunday, September 17, 2017 - 17:47

విశాఖ : విశాఖపట్నం పోర్టు భూములను ఐటీ కంపెనీలకు దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సీపీఎం వ్యతిరేకించింది. సాలిగ్రామపురంతో పాటు ఎయిర్‌ పోర్టు దగ్గర ఉన్న 200 ఎకరాలను ఐటీ కంపెనీలకు 60 ఏళ్ల లీజుకు ఇచ్చే ప్రతిపాదనలను విరమించుకోవాలని డిమాండ్‌ చేసింది. లేకపోతే ఉద్యమం తప్పదని సీపీఎం నేత నర్సింగరావు హెచ్చరించారు. 

 

Sunday, September 17, 2017 - 15:19

విశాఖ : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.. వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు.. పర్యావరణహిత ఇంధనానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటించారు.. పర్యావరణ పరిరక్షణపై విశాఖలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ సదస్సుకు చంద్రబాబు హాజరయ్యారు.. ఈ కార్యక్రమంలో...

Friday, September 15, 2017 - 07:03

విశాఖ : ప్రముఖ జర్నలిస్టు, రచయిత గౌరీ లంకేశ్ హత్యను ఖండిస్తూ విశాఖలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రెస్ క్లబ్‌ నుంచి జీవీఎంపి గాంధీ విగ్రహం వరకూ జరిగిన ర్యాలీలో సీపీఐ, సీపీఎం, వైసిపి, లోక్‌సత్తా నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జర్నలిస్టులకు రక్షణ కల్పిస్తూ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. 

Tuesday, September 12, 2017 - 21:41

విశాఖ : నగరంలో ఇండియన్‌ ఓపెన్‌ ప్రపంచ ర్యాంకింగ్‌ స్కూకర్‌ టోర్నమెంట్‌ను సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఈ పోటీలు ఈరోజు నుంచి ప్రారంభంకానున్నాయి. నగరంలోని బీచ్ రోడ్డులో ఉన్న నోవాటెల్ హోటల్లో ఐదు రోజులపాటు ఈ పోటీలు జరుగుతాయి. స్నూకర్‌ టోర్నీలో వరల్డ్ నెంబర్ వన్‌ షాన్‌మర్ఫీ, భారత స్నూకర్‌ ఆదిత్య మెహతా సహా 64 మంది అగ్ర క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనున్నారు. ప్రపంచ ఛాంపియన్‌...

Tuesday, September 12, 2017 - 20:29

 విశాఖ : కట్టుకున్నవాళ్లు వదిలేశారు...! అయినవాళ్లు.. తరిమికొట్టారు...! గ్రామ పెద్దలు శిక్షించారు..! న్యాయం కోసం అడిగితే... పరీక్షలు చేశారు... ప్రశ్నలతో వేధించారు..! పోలీసుల దాష్టీకానికి బలై... ఎన్నో అవమానాలకు గురయ్యారు వాకపల్లి ఆదివాసీ మహిళలు.. అందులో ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు... ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత సుప్రీం కోర్టు స్పందించింది.. జరిగిన జాప్యంపై ఆగ్రహం వ్యక్తం...

Tuesday, September 12, 2017 - 16:45

విశాఖ : విశాఖపట్టణం, పెందుర్తిలో మంత్రి నారా లోకేశ్‌ పర్యటించారు. పర్యటనలో భాగంగా సమాఖ్య భవనం, షాపింగ్‌ కాంప్లెక్స్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యారు. అప్పులు ఒక రాష్ట్రానికి, ఆస్తులు ఒక రాష్ట్రానికి ఇచ్చారని మంత్రి లోకేశ్‌ అన్నారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా.. సీఎం ప్రజలకు లోటు లేకుండా పరిపాలన చేస్తున్నారన్నారు. డ్వాక్రా సంఘాలను మరింత మలోపేతం...

Pages

Don't Miss