శ్రీకాకుళం
Thursday, March 15, 2018 - 07:12

విజయవాడ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది... మార్చి 15 నుంచి 29వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వీఎంసీ పరిధిలోని పాఠశాలల్లో మాత్రం జంబ్లింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలోని పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు....

Monday, March 12, 2018 - 17:37

శ్రీకాకుళం : వేతనాలు చెల్లించాలంటూ శ్రీకాకుళం జిల్లా రిమ్స్‌ వైద్యశాలలో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్‌ సీఐటీయూ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తోన్న జై బాలాజీ కాంట్రాక్టర్‌పై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమ్మెకు కాంగ్రెస్‌ నాయకులు మద్దతు పలికారు. కార్మికుల సమస్యలు...

Friday, March 9, 2018 - 15:03

శ్రీకాకుళం : జిల్లా అరసవల్లిలో మూలవిరాట్టును తాకే సూర్యకిరణాలను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి ఏటా మార్చి 9, 10 తేదీలలో సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకుతాయి. అయితే మబ్బులు పట్టడంతో సూర్యనారాయణ స్వామి పాదాలకు ఇవాళ సూర్యకిరణాలు తాకకపోవడంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు. 

Wednesday, February 28, 2018 - 19:47

శ్రీకాకుళం : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఏనుగుల గుంపులు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇవి తోటల మీద పడి పంటలను సర్వనాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన చెందుంతుంటే... మరోవైపు రాత్రివేళల్లో ఏనుగులు సంచరిస్తుండడంతో బయటికి రావాలంటే భయమేస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏనుగుల బీభత్సం
శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీప్రాంతంలో...

Tuesday, February 27, 2018 - 17:04

శ్రీకాకుళం : లక్షలాది మంది దాహార్తిని తీర్చే నది మురికి కాలువను తలపిస్తోంది. మురుగు నీరు, చెత్త, చెదారం, ఇతర వ్యర్థాలన్నీ కలిసి మురికి కాలువగా మారిపోయింది. ఇంత జరుగుతున్నా నగర ప్రజలకు సురక్షిత నీరు అందించాల్సిన నగర పాలక సంస్థ చోద్యం చూస్తోంది. ఇది శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి నది పరిస్థితి.  
దుర్గంధం వెదజల్లుతున్న నాగావళి నది
ఎందరికో దాహార్తిని...

Wednesday, February 21, 2018 - 15:28

శ్రీకాకుళం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా..స్పెషల్ ప్యాకేజీపై గతంలో ఒక మాట మాట్లాడారని..ప్రస్తుతం ఒక మాట మాట్లాడుతున్నారని..బాబు మాట మారుస్తున్నారని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిక్కోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని, ప్రత్యేక హోదాపై ప్రజలను భాగస్వాములను చేయాలని..లేనిపక్షంలో తామే ఈ పని...

Monday, February 19, 2018 - 18:18

శ్రీకాకుళం : విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాత్రమే టీడీపీ కోరుతోందన్నారు మంత్రి పితాని సత్యనారాయణ. రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను మంత్రి ఖండించారు. మిత్రపక్షాలుగా ఉన్న తాము పరస్పరం విమర్శలకు దిగడం మంచిదికాదన్నారు. మిత్రత్వం తెంచుకోడానికి కూడా సిద్ధమంటున్న ఏపీ బీజేపీ నేతల తీరున మంత్రి తప్పుపట్టారు. టీడీపీ -బీజేపీల పొత్తులు తదిర విషయాలు జాతీయ...

Saturday, February 17, 2018 - 16:52

శ్రీకాకుళం : బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017లో అద్భుతంగా ఉందన్న టీడీపీ నేతలు... 2018లో బీజేపీపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సోము వీర్రాజు... కేంద్రం ఇచ్చిన సహాయం ఎక్కడ, ఎలా ఖర్చు చేసిందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలన్నారు. వెనకబడిన జిల్లాల...

Wednesday, February 14, 2018 - 18:40

శ్రీకాకుళం : రోజుకో మాట మారుస్తూ వైసీపీ డ్రామాలాడుతోందని విమర్శించారు శ్రీకాకుళం పార్లమెంట్‌ సభ్యులు కింజారపు రామ్మోహన్‌ నాయుడు. పాదయాత్రకే ఆదరణ లేని సమయంలో ఎంపీల రాజీనామ పేరుతో పార్టీ మైలేజ్‌ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. రాష్ట్రానికి స్పెషల్‌ స్టేటస్‌ కోసం తాము పోరాటం చేస్తూనే ఉంటామని, రాష్ట్ర హక్కుల పరిరక్షణకు ఢిల్లీలో తమ గళాన్ని వినిపించగలిగామన్నారు...

Pages

Don't Miss