రంగారెడ్డి
Monday, October 23, 2017 - 11:26

రంగారెడ్డి : జిల్లా హయత్‌నగర్‌ మండలం తొర్రూరులో కుక్కలు స్వైర విహారం చేశాయి. గొర్రెలమందపై దాడిచేయడంతో 24 గొర్రెలు చనిపోయాయి. దీంతో గొర్రెల కాపారులు ఆందోళన చెందుతున్నారు. 

Saturday, October 21, 2017 - 21:21

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పోలీసు అమరవీరులకు తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళులు అర్పించారు. పోలీసు ఉన్నతాధికారులు అమరులైన పోలీసు కుటుంబాలను పరామర్శించారు. అమరులైన పోలీసులకు నివాళులు అందించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ గోషామహల్‌లో నిర్వహించిన పోలీసు సంస్మరణ వేడుకల్లో...

Saturday, October 21, 2017 - 13:14

రంగారెడ్డి : జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో జడ్డా నుంచి వచ్చిన వ్యక్తి నుంచి 612గ్రాముల బంగాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తి అండర్ వేర్ కు ప్రత్యేక జేబు ఏర్పాటు చేసుకుని బంగారం తీసుకొచ్చాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో గత పదిరోజుల్లో 3కిలోల 40గ్రాముల బంగారం పట్టుబడింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Wednesday, October 18, 2017 - 16:18

రంగారెడ్డి : జిల్లా కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఐదుగురి మృతి ఘటనలో విచారణ ప్రారంభమైంది. నార్సింగ్ పోలీసులు రామచంద్రాపురంలో ఉన్న ప్రభాకర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో ల్యాప్ టాప్, సెల్ ఫోన్, బ్యాంక్ అకౌంట్ పత్రాలు డీమార్ట్ షేర్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. చినిపోయిన ప్రభాకర్ రెడ్డి, లక్ష్మి ఫోన్లు ఇంతవరకు లభించలేదని పోలీసులు తెలిపారు. ఈ...

Wednesday, October 18, 2017 - 13:51

రంగారెడ్డి : కొల్లూరు ఆత్మహత్యలపై మిస్టరీ కొనసాగుతోంది. ఐదుగురు మృతిపై అనేక అనుమానాలున్నాయి. మాదాపూర్ డీసీపీ విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఇంతవరకు ప్రభాకర్ రెడ్డి, లక్ష్మీల సెల్ ఫోన్లు లభించలేదు. డిండి ప్రాజెక్టులో సెల్ ఫోన్లు పడేశారని అనుమానం కలుగుతుంది. ప్రభాకర్ రెడ్డి కాల్ లిస్టు పరిశీలిస్తున్నారు. కారు వెళ్లిన మార్గాన్ని గుర్తించేందుకు సీసీ టీవీ పుటేజీ...

Wednesday, October 18, 2017 - 10:11

రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్‌ మండలం కిషన్‌గూడాలో ఆర్టీఏ దాడులు చేపట్టింది. హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సులను తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి ఐదు బస్సులపై కేసులు నమోదు చేశారు. ఒక బస్సును సీజ్‌ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Tuesday, October 17, 2017 - 13:41

రంగారెడ్డి : జిల్లాలోని రామచంద్రాపురం మండలం కొల్లూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలోని చెట్ల పొదల్లో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను గమనించిన స్థానికులు నార్సింగి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి క్లూస్‌ టీమ్స్‌ చేరుకుని వివరాలు సేకరిస్తోంది...

Tuesday, October 17, 2017 - 13:09

రంగారెడ్డి : జిల్లాలోని రామచంద్రాపురం మండలం కొల్లూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలోని చెట్ల పొదల్లో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను గమనించిన స్థానికులు నార్సింగి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి క్లూస్‌ టీమ్స్‌ చేరుకుని వివరాలు సేకరిస్తోంది...

Tuesday, October 17, 2017 - 12:36

రంగారెడ్డి : హైదరాబాద్‌ నగర శివారులో మృతదేహాల కలకలం నెలకొంది. కొల్లూరు సమీపంలో ఐదు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. ఓఆర్‌ఆర్‌కు సమీపంలో ఇద్దరు పురుషులు, ఒక మహిళతో పాటు.. ఇద్దరు యువతుల మృతదేహాలు చెట్ల పొదల్లో గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకుని నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెల్‌ఫోన్‌ ఆధారంగా పోలీసులు వివరాలు...

Pages

Don't Miss