ప్రకాశం
Friday, May 26, 2017 - 10:41

ప్రకాశం : చీరాలలో పోలీస్‌ కానిస్టేబుల్‌ భార్య అనుమానాస్పద మృతి విషాదం నింపింది. హరిప్రసాద్‌నగర్‌లో ఉండే ఏఆర్‌ కానిస్టేబుల్‌ తిరుమలరావు -రమాదేవి దంపతులు తరచు గొడవపడేవారు. మద్యానికి బానిస అయిన తిరుమలరావు తరచు భార్యను కొడుతూ హింసించేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో వంటగదిలో భార్యపై కిరోసిన్‌పోసి నిప్పంటించాడని స్థానికులు అనుమానిస్తున్నారు. వివాహేతర...

Friday, May 26, 2017 - 06:47

ప్రకాశం : తెలుగుదేశం పార్టీకి పండగ లాంటి మినీ మహానాడు ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రశాంతంగా ముగిసింది. ఈ వేదిక మీదనుంచి పలు సమస్యలపై నేతలు గళమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాకు కేటాయించిన పరిశ్రమలు, విశ్వ విద్యాలయాలు, రామాయపట్నం పోర్టు వంటి అంశాలపై నేతలంతా ఏక తాటిపైకి వచ్చారు. వీరంతా ఈ విషయంలో ఒకే గళం వినిపించారు. మినీ మహానాడు సందర్భంగా నేతలు చేసిన...

Thursday, May 25, 2017 - 09:59

ప్రకాశం: కొండెపిలో దారుణం చోటు చేసుకుంది. నూడిల్స్‌ బండి వద్ద పని చేసే బాలుడు ఆరుముళ్ల విజయ్‌కుమార్‌.. అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నూడిల్స్‌ బండి యజమాని మురగళ్ల సుబ్రహ్మణ్యమే బాలుడిని హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పనిలోకి రావడం లేదని విజయ్‌కుమార్‌ని సుబ్రహ్మణ్యం చిత్రహింసలు పెట్టాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు.. కందుకూరు ఏరియా...

Tuesday, May 23, 2017 - 21:18

ప్రకాశం : ఎమ్మెల్యే గొట్టిపాటి రవి రెచ్చగొట్టడం వల్లే ఒంగోలు టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఎమ్మెల్సీ కరణం బలరాం స్పష్టం చేశారు. గొట్టిపాటి గన్‌మెన్‌ వ్యవహార శైలితోనే సమావేశంలో ఘర్షణ వాతావరణం తలెత్తిందన్నారు. గన్‌మెన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఎమ్మెల్యే గొట్టిపాటి చేసే ప్రతి చర్యకు పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదన్నారు.

Tuesday, May 23, 2017 - 18:51

ప్రకాశం : జిల్లా కందుకూరులో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గతరాత్రి 19 మందిపై దాడిచేయడంతో గాయాలపాలైన వారంతా ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిచ్చికుక్కలకు భయపడి జనం బయటకు రావడానికి హడలిపోతున్నారు. అధికారులకు విన్నవించినా ఫలితం ఉండట్లేదని స్ధానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా కుక్కల బెడద నుంచి తమని కాపాడాలని స్ధానికులు కోరుతున్నారు.

Tuesday, May 23, 2017 - 18:31

ప్రకాశం : కరణం, గొట్టిపాటి వర్గాలు మళ్లీ తలపడ్డాయి. ఏకంగా వర్గాల నేతలే బాహాబాహీకి సిద్ధపడ్డారు. దీంతో టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం రసాబాసగా మారింది. వేమవరం హత్యల నేపథ్యంలో, ఇరు వర్గాలు ఈ సమావేశంలో ఆవేశంతో ఊగిపోయాయి. మంత్రులు పరిటాల సునీత, నారాయణ, శిద్దా రాఘవరావు సమక్షంలోనే నాయకులు రెచ్చిపోయారు. పరిస్థితి అదుపులో వుంచేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రకాశం...

Tuesday, May 23, 2017 - 14:25

ప్రకాశం : జిల్లాలో టిడిపి నేతల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఫ్యాక్షన్ గొడవలు..హత్యలు ఎక్కువవుతున్నాయి. ఇటీవలే టిడిపి ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గీయులను దారికాచి దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య చేసింది ఎమ్మెల్యే గొట్టిపాటి వర్గీయులేనంటూ కరణం బలరాం ఆరోపణలు గుప్పించారు. గొడవలు..హత్యలు మరువక ముందే మరోసారి గొట్టిపాటి - కరణం వర్గీయులు మరోసారి గొడవకు దిగారు....

Tuesday, May 23, 2017 - 13:26

ప్రకాశం: వేమవరంలో జరిగిన జంట హత్యలను ఎమ్మెల్యే గొట్టిపాటే చేయించారని ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి తనయుడు కరణం వెంకటేష్ ఆరోపించారు. ఆయన '10టివి 'తో మాట్లాడుతూ తెలుగు దేశం కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూడాలని చంద్రబాబును కోరనున్నట్లు తెలిపారు. ఎవరు ఎలాంటి వారో అధిష్టానానికి తెలుసునని పేర్కొన్నారు. ఇంకా అనేక విషయాలను వివరించారు. పూర్తి వివరాలకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి......

Tuesday, May 23, 2017 - 13:24

ప్రకాశం : వేమవరం జంట హత్యలకు మాకు ఎలాంటి సంబంధం లేదని అద్ధంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి స్పష్టం చేశారు. ఆయన '10టివి'తో మాట్లాడారు...ఆయన ఈ రోజు ఒంగోలులోని ఏ1 కన్వెన్షన్ హాల్ లో పాల డైరీకి చెందిన సభ జరిగింది. ఈ సభకు ఇరు వర్గాల వారు హాజరయ్యారు. ఇరు వర్గాల మధ్యఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో గొట్టిపాటి రవి చొక్కి చినిగిపోయినట్లు సమాచారం. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను శాంతింపచేసి...

Pages

Don't Miss