నిజామాబాద్
Tuesday, June 19, 2018 - 16:45

నిజామాబాద్ : ముగ్గురు పాకీస్థానీ పౌరులకు భారత దేశ పౌరసత్వం లభించింది. నిజామాబాద్‌ ఆర్డీవో వినోద్‌ కుమార్‌ ఈ మేరకు తన కార్యాయలంలో వారికి పౌరసత్వ పత్రాలను అందించారు. నిజమాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన ఫయాజ్‌ ఉన్నీస పాకీస్థాన్‌కి చెందిన నదీమ్‌ జావిద్‌ని 1988లో వివాహం చేసుకుంది. కుటుంబకలహాలతో 2004లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. అనంతరం ఫయాజ్‌ భారత్‌కు...

Monday, June 18, 2018 - 11:48
Monday, June 18, 2018 - 09:39

నిజామాబాద్ : ఇందల్ వాయి బంద్ కొనసాగుతోంది. ఓ మహిళ పట్ల ఎంపీపీ దురుసు ప్రవర్తన చేసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ నేత, దర్పల్లి ఎంపీపీ ఇమ్మడి గోపి ...మహిళ పట్ల స్థల వివాదం నెలకొంది. ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తడం..వెంటనే గోపి తన కాలితో మహిళ ఛాతిపై తన్నాడు. ఎంపీపీ వ్యవహర శైలిని ప్రతిపక్ష నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. వెంటనే అతడిపై కేసు నమోదు చేయాలని...పార్టీ నుండి ఎంపీపీ పదవి నుండి...

Sunday, June 17, 2018 - 15:08

నిజామాబాద్‌ : జిల్లాలో దర్పల్లి మండల ఎంపీపీ ఇమ్మడి గోపి వీరంగం సృష్టించాడు. ఇందల్వాయి మండలం గౌరారంలో ఓ స్థల రిజిస్ట్రేషన్‌ విషయంలో ఒడ్డె రాజవ్వ అనే మహిళతో వాగ్వాదానికి దిగాడు. రిజిస్ట్రేషన్‌ విషయంలో వీరి మధ్య మాట మాట పెరగడంతో.. ఎంపీపీ అనుచరులు ఇంట్లోని సామాన్లు అన్నీ రోడ్డుపై పడేశారు. అంతేకాకుండా తోపులాటలో ఎంపీపీ మహిళను కాలుతో తన్నాడు. దీంతో పరిస్థితి...

Wednesday, June 13, 2018 - 08:21

నిజామాబాద్‌ : జిల్లాలో ఖాకీల నెలవారీ వసూళ్ల వ్యవహారం పోలీస్‌శాఖనే నివ్వెరపరుస్తోంది. ప్రతి అక్రమ దందాలో పోలీసుల సహకారం ఉన్నట్టు తెలుస్తోంది. ఖాకీల మామూళ్ల వ్యవహారంపై రాష్ట్ర డీజీపీ కూడా సీరియస్‌ అయ్యారు. రహస్య విచారణ సాగించి పలువురిని సస్పెండ్‌ కూడా చేశారు. అయినా అక్రమ వసూళ్ల రుచి మరిగిన ఖాకీలు తమ పద్దతి మార్చుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారి...

Monday, June 11, 2018 - 18:47

నిజామాబాద్ : తొలకరి కురవడంతో.. అన్నదాతలు సాగుకు సమాయత్తమవుతున్నారు. అయితే దుక్కి దున్నడానికి కాడెద్దుల కొరత రైతన్నలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఎడ్లను అద్దెకు తెచ్చుకుని మరీ సాగు చేస్తున్నారు. ఎడ్లను అడ్వాన్స్‌గా బుక్‌ చేసుకుని .. నెలకు 15 వేల రూపాయలు చెల్లిస్తున్నారు. ఎన్ని యంత్రాలు వచ్చినా..కొన్ని సందర్భాల్లో ఎడ్ల అవసరాన్ని మాత్రం తీర్చలేకపోతోంది....

Thursday, June 7, 2018 - 17:39

నిజామాబాద్ : అడవిలో చిరుతల గాండ్రిపులు కరువయ్యాయి. ఆహారం కోసం జనారణ్యంలోకి వస్తున్నచిరుత పులులు..అడవిలోకి వెళ్లే లోపే మృత్యువాత పడుతున్నాయి. ఒక్కటి కాదు ..రెండు కాదు.. ఏడాది వ్యవధిలో ఐదు చిరుతలు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. వన్యప్రాణుల రక్షణకోసం  ప్రత్యేక నిఘా  ఏర్పాటు చేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

నిజామాబాద్ జిల్లాలో చిరుత పులుల మరణమృదంగం కొనసాగుతోంది....

Saturday, June 2, 2018 - 21:05

హైదరాబాద్ : ఎన్నో ఏళ్ల ఉద్యమం. ఎంతో మంది యువకుల ప్రాణ త్యాగాలు. ఉమ్మడి పోరాటాలు. ఉక్కు సంకల్పం. మొక్కవోని ఆత్మస్థైర్యంతో సాధించుకున్న తెలంగాణకు నాలుగేళ్లు నిండాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో...

Wednesday, May 30, 2018 - 10:48

నిజామాబాద్ : జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లిలో దారుణం జరిగింది. ఇద్దరు దారుణ హత్య గావించబడ్డారు. గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అత్తిలి రమేష్, కోశాధికారి ముద్దం రాములు దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు బండరాళ్లతో కొట్టి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

 

Wednesday, May 30, 2018 - 10:05

నిజామాబాద్ : జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లిలో దారుణం జరిగింది. ఇద్దరు దారుణ హత్య గావించబడ్డారు. గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అత్తిలి రమేష్, కోశాధికారి ముద్దం రాములు దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు బండరాళ్లతో కొట్టి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

 

Pages

Don't Miss