నెల్లూరు
Monday, April 16, 2018 - 18:12

నెల్లూరు : ప్రత్యేక హోదా కోరుతూ తలపెట్టిన బంద్‌ నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. వామపక్షాలు, వైసిపి, జనసేన, కాంగ్రెస్ పార్టీలు, పలు ప్రజాసంఘాలు బంద్ పాటించి  వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నాయి. జిల్లాలో బస్సులన్నీ డిపోలకే  పరిమితం అయ్యాయి. విద్యాసంస్థలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. జిల్లాలో కొనసాగుతోన్న బంద్‌పై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

Monday, April 16, 2018 - 10:56

విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన..విభజన హామీలు అమలుపరచాలని కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు కాంగ్రెస్, వైసీపీ, జనసేన, వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. సోమవారం ఉదయం నుండే బంద్ ప్రభావం కనిపించింది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. వ్యాపార సంస్థలు మూసివేశారు....

Saturday, April 14, 2018 - 07:03

హైదరాబాద్ : అంటరానివాడని హేళన చేస్తే అక్షరాలపై పట్టును సాధించాడు. అస్పృశ్యుడని గేలి చేస్తే దేశమే గర్వించే కెరటమై ఎగిశాడు. అందుకే ప్రతి నిరుపేద దళితుడి తలరాత అంబేద్కర్‌. ప్రపంచ దేశాలు కీర్తిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌. గతాన్ని సమీక్షించుకుని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌ను బేరీజు వేసుకుంటూ సాగిపోయిన అంబేద్కర్‌ జీవితం స్ఫూర్తిదాయకమే కాదు.ఎంతో విలువైనది...

Saturday, April 14, 2018 - 06:59

హైదరాబాద్ : పాశవికంగా దాడి చేసింది. ఎల్లలు దాటి సంపాదించిన ప్రతిభ కులం ముందు నిలువలేకపోయింది. నడుముకు తాటాకులు, మెడకు ముంతలు కట్టిన దుర్భర రోజులు దళితులను నిలువులా తెగనరికాయి. నిండైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే దళితజాతి మనువు ముందు విలవిలలాడిపోయింది. ఇందుకు అంబేద్కర్‌ ఓ సజీవ సాక్ష్యం.

ఎన్నో అవమానాలు, మరెన్నో అనుమానాలు అంబేద్కర్‌ను కలిచివేశాయి. నిచ్చెనమెట్ల కుల...

Saturday, April 14, 2018 - 06:56

హైదరాబాద్ : చరిత్రలో ఆయన స్ధానం అత్యంత విశిష్ఠమైనది. ఎన్ని ఏళ్లు గడిచినా తరగని స్ఫూర్తి నింపే గుండెధైర్యం ఆయనది. తాడిత, పీడిత వర్గాలకు ఆయనే వెలుగు రేఖ. తోటి మనిషిని సాటి మనిషే తాకనివ్వకుండా చేసిన కులవ్యవస్ధను చీల్చి చెండాడిన ధీరోదాత్తుడు. మత్తులాంటి మతం నిజస్వరూపాన్ని యావత్‌ ప్రపంచానికి బట్టబయలు చేశాడు. వెలివాడల గుండెల్లో వెలుగురేఖలు నింపాడు. దళితుల తలరాతలు మార్చి వారి...

Thursday, April 12, 2018 - 06:26

నెల్లూరు : ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. దేశీయ దిక్సూచి వ్యవస్థ కోసం ఉద్దేశించిన PSLV-C41 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరులోని శ్రీహరికోట స్పేస్‌ సెంటర్‌ నుంచి ఉదయం 4 గంటల 4 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది. 32 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి 19.19 నిమిషాల వ్యవధిలో లక్ష్యాన్ని చేరుకుంది. నాలుగు దశల అనంతరం నిర్ణయించిన సమయానికి విడిపోయి.....

Friday, April 6, 2018 - 21:13

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ.. తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టాయి. అన్ని జిల్లాల్లోనూ మండలస్థాయి వరకూ.. సైకిల్‌, బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. చంద్రబాబు కూడా.. అసెంబ్లీ వరకూ సైకిల్‌ ర్యాలీ నిర్వహించి తన నిరసనను తెలియపరిచారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రంపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందంటూ.. ర్యాలీల్లో పాల్గొన్న...

Friday, April 6, 2018 - 21:07

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిస్టు, జనసేన శ్రేణులు పాదయాత్రలు చేపట్టాయి. అన్ని జిల్లాల్లోనూ పార్టీల నాయకులు, ఉత్సాహంగా పాదయాత్ర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేదాకా ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా.. విభజన హామీల అమలు కోరుతూ.. ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు.. జనసేన...

Sunday, April 1, 2018 - 16:05

నెల్లూరు : భారత్‌ ప్రయోగించిన అధునాతన ఉపగ్రహం జీశాట్‌-6ఏతో సంబంధాలు కోల్పోయినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అధికారులు వెల్లడించారు. దాని నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదని జీశాట్‌-6ఏను ప్రయోగించిన 48 గంటల తర్వాత ఇస్రో తెలిపింది. ఈ ఉపగ్రహానికి సంబందించి చివరిదైన మూడో లామ్‌ ఇంజిన్‌ను మండించిన సమయం నుంచి దానితో అనుసంధానం కోల్పోయామని ఇస్రో తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది...

Sunday, April 1, 2018 - 13:24

నెల్లూరు : జీశాట్ 6ఎ శాటిలైట్ రెండో దశ ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఇస్రోతో జీశాట్ 6ఎ శాటిలైట్ సంబంధాలు తెగిపోవడంతో కలకలం రేగింది. వెంటనే శాస్త్రవేత్తలు అప్రమత్తమయ్యారు. లింక్ ను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కమ్యూనికేషన్ రంగం..ఇతర రంగాలకు ఎంతో ఉపయోగపడే ఈ రాకెట్ ప్రయోగాన్ని మార్చి 29న ప్రయోగించిన సంగతి తెలిసిందే. మొదటి దశ విజయవంతంగా పూర్తయినా రెండో దశలో సాంకేతిక లోపం...

Friday, March 30, 2018 - 18:44

నెల్లూరు : కపాడిపాలెంలో నిర్వహించిన గుడ్‌ ఫ్రై డే కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి నారాయణ. శాంతి, క్షమ, సోదర భావాలను ఏసుక్రీస్తు తన బోధనల ద్వారా ప్రపంచానికి సందేశామిచ్చారని మంత్రి అన్నారు. సంపాదించిన ప్రతి రూపాయిలో ఒక పైసా పేదలకు వినియోగించాలని కోరారు. ఈ సందర్భంగా క్రైస్తవులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. 

Pages

Don't Miss