నల్గొండ
Tuesday, June 19, 2018 - 12:01

నల్లగొండ : జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో పది మంది గాయపడ్డారు. హైదరాబాద్‌ నుంచి రాత్రి చీరాలకు బయలుదేరిన ట్రావెల్స్‌ బస్సు.. నల్లగొండజిల్లా వేములపల్లి మలుపు వద్ద అదుపు తప్పి పొలాల్లో దూసుకెళ్లింది. గాయపడ్డవారిని మిర్యాల గూడ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగానే బస్సు ప్రమాదం జరిగిందని ప్రయాణికులు...

Tuesday, June 19, 2018 - 09:13

నల్గొండ : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఇద్దరు మృతి చెందారు. ఏపీ 04వై7191 నంబర్ గల ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి చీరాలకు వెళ్తోంది. నల్గొండ జిల్లా వేములపల్లి మలుపు వద్ద బస్సు అదుపు తప్పి పొలాల్లోకి వెళ్లి పల్టీ కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మరో పదిమందికి గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని మిర్యాలగూడ...

Sunday, June 17, 2018 - 18:11

నల్లగొండ : రైతులు వందల రోజులు దీక్షలు చేస్తే.. కాంగ్రెస్‌ నాయకులు డ్రామాలు ఆడారు తప్ప వారిని ఏనాడు పట్టించుకోలేదని మంత్రి జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్‌ ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్‌రావుతో కలిసి జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నాయకులను తరిమికోట్టేందుకు ప్రజలు చూస్తున్నారని అన్నారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌...

Sunday, June 17, 2018 - 15:52

నల్లగొండ : నకిరేకల్ లో నిమ్మ మార్కెట్ ను మంత్రి హరీశ్ రావు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతు.. ఎన్నో ఏళ్ళ కన్న నిమ్మ మార్కెట్ ను ఈరోజు నెరవేర్చుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నిమ్మకాల మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. అలాగే నిమ్మకాయలను స్టోర్ చేసుకునేందుకు ఓ కోల్ట్ స్టోరేజ్ ను కూడా మంజూరు చేశామని తెలిపారు. అలాగే...

Sunday, June 10, 2018 - 06:49

సూర్యాపేట : పోలీసులకే చేతివాటం చూపించాడు ఓ దొంగ.. సూర్యాపేట సీఐ ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి అధికారిక వాహనం చోరీ చేశాడు. సీఐ జిమ్‌కు వెళ్ళిన సమయాన్నే అదునుగా తీసుకున్న ఆగంతకుడు.. సీఐ రమ్మంటున్నాడంటూ డ్రైవర్‌ను తప్పు దోవ పట్టించి.. వాహనంతో పరారయ్యాడు. జిల్లా ఎస్పీ, డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Wednesday, June 6, 2018 - 19:04

నల్గొండ : రైతు బంధు పథకం ద్వారా రైతుల కంటే భూస్వాములకే మరింత మేలు చేస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి తహశీల్దార్‌ కార్యాలయం ముందు జరిగిన రైతుల ధర్నాలో జూలకంటి పాల్గొన్నారు. పల్లెలు వదిలి పట్టణాల్లో వ్యాపారాలు చేసుకుంటున్న వందలాది ఎకరాలు ఉన్న బడా భూస్వాములకు రైతులకు ప్రభుత్వం.. అదే గ్రామాల్లో ఉంటున్న నిరుపేద రైతులను పట్టించుకోవడం...

Monday, June 4, 2018 - 17:58

మిర్యాలగూడ : వీటి థియేటర్ సమీపంలో ఓ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో బ్రిడ్జి పనులు నిలిచిపోయాయి. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పది రోజుల్లో పనులు చేపట్టాలని, లేనిపక్షంలో నిరహార దీక్ష చేపడుతానని జూలకంటి హెచ్చరించారు. ...

Saturday, June 2, 2018 - 21:05

హైదరాబాద్ : ఎన్నో ఏళ్ల ఉద్యమం. ఎంతో మంది యువకుల ప్రాణ త్యాగాలు. ఉమ్మడి పోరాటాలు. ఉక్కు సంకల్పం. మొక్కవోని ఆత్మస్థైర్యంతో సాధించుకున్న తెలంగాణకు నాలుగేళ్లు నిండాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో...

Saturday, June 2, 2018 - 17:17

నల్గొండ : పిడుగుపాటులు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. పిడుగులు పడుతుండడంతో ప్రాణనష్టం సంభవిస్తోంది. తాజాగా నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ అలగడపలో పిడుగు పడింది. గొర్రెల మేత కోసం వెళ్లిన దంపతులు ఎల్లావుల వెంకయ్య, నర్సమ్మలపై ఈ పిడుగు పడడంతో అక్కడికక్కడనే మృతి చెందారు. దంపతులిద్దరూ మృతి చెందడంతో అలగడపలో విషాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సీపీఎం నేత...

Wednesday, May 30, 2018 - 16:24

నల్లగొండ : న్యాయ బద్ధంగా వేతన సవరణ చేయాలంటూ దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు చేపట్టిన రెండు రోజుల సమ్మె కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రభుత్వరంగ బ్యాంకు సిబ్బంది సమ్మె చేస్తున్నారు. మొత్తం 21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన సుమారు 10 వేల మంది సిబ్బంది సమ్మె చేయడంతో బ్యాంకు సేవలు నిలిచిపోయాయి. బ్యాంకు ఉద్యోగుల సమ్మెను బ్యాంక్ ఉద్యోగులు...

Saturday, May 26, 2018 - 08:23

నల్లగొండ : ట్రాఫిక్ సమస్యలు పాటించకపోవటంతో పలు ప్రమాదాలకు లోనవుతున్న సందర్బాలు అనేకం జరుగుతున్నాయి. రోడ్డుపై వాహనదాలరు పాటించాల్సిన నిబంధలను ఖాతరు చేయకపోవటంతోవారితో పాటు పరుల ప్రాణాలకు కూడా ముప్పు తెస్తున్నారు కొందరు. దీంతో చాలా సందర్భాలలో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్న దారుణమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో ప్రమాదానికి కారణమయ్యింది....

Pages

Don't Miss