మహబూబ్-నగర్
Saturday, March 25, 2017 - 17:37

మహబూబ్ నగర్ : ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్న సౌకర్యాలన్నింటిని ప్రైవేట్‌ కళాశాల, పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి కల్పించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణా లెక్చరర్‌ ఫోరం మహబూబ్‌నగర్‌లో చైతన్య యాత్రను ప్రారంభించింది. నేటి నుంచి ఏప్రిల్‌ 1 వరకు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని రాష్ట్ర కార్యదర్శి కత్తి వెంకటస్వామి తెలిపారు....

Thursday, March 23, 2017 - 07:52

హైదరాబాద్ : మహబూబ్‌నగర్‌..రంగారెడ్డి..హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి కాటేపల్లి జనార్థన్‌రెడ్డి విజయం సాధించారు. అంబర్‌పేట ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఓట్ల లెక్కింపులో జనార్థన్‌రెడ్డికి 9734 ఓట్లు రాగా..తన ప్రత్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డికి 5095 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డిపై 4,639 ఓట్ల తేడాతో జనార్థన్‌రెడ్డి విజయం సాధించారు...

Wednesday, March 22, 2017 - 08:09

హైదరాబాద్ : రంగారెడ్డి, హైద‌రాబాద్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కౌటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. 12మంది అభ్యర్ధులు పోటిప‌డుతున్న ఈ ఎన్నిక‌లో ఫోటోల మార్ఫింగ్‌తో రీపోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. బుధవారం జరిగే కౌటింగ్ కోసం.. అంబర్‌పేటలోని ఇండోర్ స్టేడియంలో  అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 
ఓటు హ‌క్కు వినియోగించుకున్న 19,624 మంది...

Saturday, March 18, 2017 - 12:49

మహబూబ్ నగర్ : విద్యార్ధులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే విద్యా నిలయాలు. ఎంతోమందిని మేధావులుగా తయారు చేసే విద్యా కేంద్రాలు. అవే సంక్షేమ హాస్టల్స్‌. విద్యార్ధులను ఉన్నతులుగా తీర్చిదిద్దే సంక్షేమ హాస్టల్స్‌ నేడు సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయి. సమస్యలతో సతమతమవుతున్నాయి. కనీస వసతులులేక సమస్యలకు నిలయాలుగా మారాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని సంక్షేమ హాస్టల్స్‌ దుస్థితిపై 10టీవీ...

Friday, March 17, 2017 - 19:58

హైదరాబాద్ : పల్లెపల్లెను పలకరించింది.. కార్మిక, కర్షక, దళితుల, మహిళల సమస్యలను తెలుసుకుంది.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపింది... అన్ని వర్గాల ప్రజలను కదిలించింది..పాలకుల గుండెల్లో గుబులు పుట్టించింది సీపీఎం మహాజన పాదయాత్ర. ఆటంకాలను, అడ్డంకులను అధిగమించి... విజయవంతంగా ముందుకు సాగింది. సీపీఎం చేపట్టిన మ‌హాజన పాదయాత్ర ఐదు నెలల క్రితం ఇబ్రహింపట్నంలో నిర్వహించిన భారీ బహిరంగసభతో...

Sunday, March 12, 2017 - 18:53

హైదరాబాద్ : రంగుల కేళీ హోలీ.. మరోసారి తెలంగాణలో సందడి చేసింది. చిన్నపిల్లల దగ్గరి నుంచి ముసలివారి వరకు రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. రాజ్‌ భవన్‌లో జరిగిన సంబరాల్లో గవర్నర్ దంపతులతో పాటు... నేతలు పాల్గొని సందడి చేశారు. రాజ్‌భవన్‌లో హోలీ సంబరాలు ఉత్సాహంగా సాగాయి. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని సంబరాలు ప్రారంభించారు. గవర్నర్‌ అందరికీ రంగులు...

Thursday, March 9, 2017 - 16:44

హైదరాబాద్: ఎస్ ఎల్ బి సి. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాలు. ఈ ప్రాజెక్టు మూడు దశాబ్దాల కల. ఇప్పటికీ నెరవేరలేదు. ఎప్పటికి పూర్తవుతుందో తెలవదు. ఎస్ ఎల్ బిసి ప్రాధాన్యతను తెలంగాణ ఉద్యమనాయకుడిగా వున్న రోజుల్లోనే గుర్తించారు కెసిఆర్. ఉద్యమ కాలంలో ఎక్కడ ఏ సమావేశం జరిగినా ఆయన ఎస్ ఎల్ బిసి గురించి ఖచ్చితంగా ప్రస్తావించేవారు. నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలు సస్యశ్యామలం...

Wednesday, March 8, 2017 - 10:49

మహబూబ్ నగర్ : తెలిసీ, తెలియని వయసులో జోగినిగా మారిన ఆ అమ్మాయి.. ఇప్పుడు ఓశక్తిగా మహిళలకోసం పోరాడుతోంది. సమాజం పశుబలంతో వేసిన సంకెళ్లను తెంచుకుని తనలాంటి అభాగ్యులకు అండగా నిలుస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా ఉట్కూరు గ్రామానికి చెందిన హాజమ్మ జోగిని వ్యవస్థపై అలుపెరగని పోరాటం చేస్తోంది. పాలమూరుజిల్లాలోని మారుమూల పల్లెల నుంచి అంతర్జాతీయ వేదికల వరకు ఈ దురాచారంపై గళమెత్తిన హాజమ్మ పై...

Friday, March 3, 2017 - 10:44

మహబూబ్ నగర్ : కరవు జిల్లా పాలమూరు ప్రజలను నీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. జిల్లాకు వరప్రదాయినిగా పేరొందిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీటిమట్టం గణనీయంగా పడిపోతోంది. దీంతో జూరాలపై ఆధారపడిన జలాశయాలు ఒక్కొక్కటిగా ఎండిపోతున్నాయి. రోజురోజుకు పడిపోతున్న నీటిమట్టం జిల్లా వాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్‌లో నీటి కష్టాలను ఊహించుకుని జిల్లా వాసులు బెంబేలెత్తిపోతున్నారు....

Pages

Don't Miss