కృష్ణ
Sunday, March 26, 2017 - 21:14

హైదరాబాద్ : విభజన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని తెలుగు రాష్ట్రాల త్రిసభ్య కమిటీలు నిర్ణయించాయి. ఉద్యోగుల బదలాయింపు, ఆస్తుల పంపకం, సచివాలయం, శాసనసభ, శాసనమండలి భవనాల అప్పగింత, 42 కార్పొరేషన్ల విభజన వంటి అంశాలను పరస్పర చర్చలు ద్వారా పరిష్కరించుకోవాలని ప్రతిపాదించారు. విభజన సమస్యలు పరిష్కరించుకునేందుకు ఏర్పాటైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల త్రిసభ్య కమిటీలు రాజ్‌భవన్‌లో...

Sunday, March 26, 2017 - 19:28

విజయవాడ : ఏపీ ఆర్టీఏ కమిషనర్‌పై టీడీపీ నేతల దాడి వివాదం సద్దుమణిగింది. కమిషనర్‌పై దౌర్జన్యానికి దిగిన టీడీపీ నేతలు ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్‌ కావడంతో కమిషనర్‌ను క్షమాపణలు కోరారు. మరోవైపు టీడీపీ నేతల దాడిని విపక్ష నేతలు తప్పుపట్టారు. అటు ఉద్యోగ సంఘాల నేతలూ టీడీపీ నేతల దాడిని ఖండించారు. విజయవాడలో ఆర్టీఏ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంతో ఎంపీ కేశినేని,...

Sunday, March 26, 2017 - 18:25

విజయవాడ :  సోలార్ పై అవగాహన పెంచుకోవాలని సోల్ టెక్ సంస్థ మేనేజర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం ఆటోనగర్ లో సోలార్ పవర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోల్ టెక్ సంస్థ నిర్వాహకులు, రాష్ట్రంలోని ప్రైవేటు ఎలక్ర్టికల్ సభ్యులకు సోలార్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోలార్ పై ప్రజల్లో కొంత అపోహ ఉందని, కరెంటుతో సంబంధం లేకుండా సోలార్ ను వినియోగించుకోవచ్చన్నారు. అయితే రాష్ట్ర...

Sunday, March 26, 2017 - 16:15

విజయవాడ : రవాణా శాఖ అధికారులతో విజయవాడ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీ, ఇతర నేతలు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. అయితే ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కమిషనర్ కు క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ వివాదంపై కమిషనర్ బాలసుబ్రమణ్యం స్పందించారు. ఇలాంటి ఘటనల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, క్షమాపణలు చెప్పడంతో ఇంతటితో వివాదాన్ని...

Sunday, March 26, 2017 - 16:12

విజయవాడ : ఏపీ రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యంకు ఏపీ టిడిపి నేతలు కేశినేని, బోండా ఉమ, బుద్ధా వెంకన్నలు క్షమాపణలు చెప్పారు. శనివారం నాడు రవాణాశాఖ కమిషనర్ పై దౌర్జన్యం చేయడం తీవ్ర వివాదస్పదంగా మారింది. దీనిపై ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదం మరింత ముదురుతుండడంతో బాలసుబ్రమణ్యంకు నేతలు క్షమాపణలు చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడితో వీరు భేటీ...

Sunday, March 26, 2017 - 14:06

కృష్ణా : విజయవాడ ఆర్టీఏ వద్ద జరిగిన ఘటనపై టీటీపీ నేతలు విచారం వ్యక్తం చేశారు. నిన్నటి ఘటన దురదృష్టకరమన్నారు. మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమని చెప్పారు.  సీఎం చంద్రబాబును కలిసిన అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు.
మేం ఎవరనీ దూషించలేదు : బోండా ఉమా
'నిన్నటి ఘటన దురదృష్టకరం. విచారణ వ్యక్తం చేస్తున్నాం. మేం ఎవరినీ దూషించలేదు....

Sunday, March 26, 2017 - 13:42

కృష్ణా : విజయవాడ రవాణాశాఖ కమిషనర్‌ బాలసుబ్రమణ్యంపై టీడీపీ నేతల దాడిని ఆర్టీఏ ఉద్యోగుల సంఘం ఖండించింది. నేతలపై వెంటనే క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కొద్దిరోజులక్రితం బస్సు ప్రమాదం నివేదికను మార్చి ఇవ్వాలంటూ నేతలు ఒత్తిడిచేశారని. దానికి తాము ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. పట్టాభి అనే వ్యక్తి తమ కార్యాలయానికివచ్చి ఎంపీగారు పంపారని... రిపోర్ట్ ఇవ్వాలన్నారని...

Sunday, March 26, 2017 - 13:00

కృష్ణా : విజయవాడలోని రోడ్‌ట్రాన్స్‌పోర్టు కార్యాలయంముందు టీడీపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రౌడీయిజం చేశారని.. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపించాలని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం రౌడీ ప్రభుత్వం కాకపోతే ఈ ముగ్గురిపై వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే సీఎం చంద్రబాబు రౌడీ రాజ్యాన్ని కొనసాగిస్తున్నారని చెప్పాల్సివస్తుందని...

Pages

Don't Miss