ఖమ్మం
Friday, May 26, 2017 - 09:21

ఖమ్మం: జిల్లాలో దారుణం జరిగింది. కల్లూరుమండలం పెదకూరుకుండి గ్రామంలో మహిళపై యాసిడ్‌ దాడి జరిగింది. గత రాత్రి ఆరుబయట నిద్రిస్తున్న మహిళపై 12, 1 గంటల మధ్య దుండగులు యాసిడ్‌ పోశారు. ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడింది. ఖమ్మంలోని అభయ ఆస్పత్రికి తరలించిన కుటుంబసభ్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే...

Thursday, May 25, 2017 - 20:07

ఖమ్మం :్ మిర్చీ పంట ధర పెంచాలని పోరాడితే రైతులకు సంకెళ్లువేశారని.. రైతుసంఘం జాతీయ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి మండిపడ్డారు.. ఈ కేసులో జైలుకువెళ్లిన 10మంది రైతులను ఖమ్మం మంచికంటి భవన్‌లో రైతుసంఘం, గిరిజన సంఘం ఆధ్వర్యలో సన్మానించారు.. ఖమ్మం మిర్చీయార్డు ఘటనలో 10 టీవీ రైతులపక్షాన నిలబడిందని ప్రశంసించారు.. 10టీవీ ప్రతినిధి సైదులకు సన్మానం చేశారు. 

Thursday, May 25, 2017 - 15:40

ఖమ్మం : జిల్లా సూర్యాపేట నుండి మద్దులపల్లి వరకు జాతీయ రహదారి విస్తరణ పనుల నేపథ్యంలో రైతులు పెద్ద ఎత్తున తమ భూములు కోల్పోనున్నారు. ఎకరాకు 20 లక్షలు పలికే భూమికి ప్రభుత్వం 6 లక్షలు చెల్లిస్తామని చెప్పడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భూమి కోల్పోయి .. పనులు లేక ఎలా బతికేదని ప్రశ్నిస్తున్నారు. వారు టెన్ టివితో మాట్లాడారు పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

Tuesday, May 23, 2017 - 17:28

హైదరాబాద్ : నక్సల్ బరి ఉద్యమాన్ని స్మరిస్తూ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు వాల్ పోస్టర్లు వేశారు. నక్సల్ బరి ఉద్యమానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 23 నుండి 29వ తేదీ వరకు వారోత్సవాలు జరుపుకోవాలంని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా ప్రాంతాల్లో పోస్టర్లు దర్శనమిచ్చాయి.

 

Thursday, May 18, 2017 - 10:43

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. వడదెబ్బకు నల్గొండ జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో దామచర్ల వ్యవసాయ విస్తరణాధికారి నాగరాజు ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఐదుగురు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. తీవ్ర రూపం...

Wednesday, May 17, 2017 - 19:10

ఖమ్మం: మండుతున్న ఎండలు.. మద్యం విక్రయాలను భారీ స్థాయిలో పెంచేశాయి. ముఖ్యంగా చల్లచల్లని బీర్‌ల కోసం వినియోగదారులు ఎగబడుతున్నారు. దీంతో ప్రస్తుత వేసవిలో.. కోట్లాది రూపాయల మద్యం అమ్ముడవుతోంది.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీర్‌లకు డిమాండ్‌

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ... భానుడు...

Tuesday, May 16, 2017 - 16:45

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రెండు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ప్రతిరోజు సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 45 డిగ్రీలు, రాత్రివేళల్లోనూ 35 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత ఉంటోంది. తీవ్రమైన పగటి ఉష్ణోగ్రతల కారణంగా భూమి సెగలు కక్కుతోంది. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు తీవ్ర...

Sunday, May 14, 2017 - 12:33

ఖమ్మం: సీఎం కేసీఆర్‌ కుటుంబ రాజకీయాల వల్ల మిర్చి రైతులు నలిగిపోతున్నారని విమర్శించారు టిడిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి. మిర్చి రైతులకు న్యాయం చేయాలంటూ ఖమ్మంలో ఒక్కరోజు దీక్ష చేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అన్నంపెట్టే రైతులను కేసీఆర్‌ పట్టించుకోవడంలేదని..గిట్టుబాటు ధరలేక రైతులు విలవిలలాడిపోతుంటే స్పందించడంలేదని విమర్శించారు. ఇప్పటివరకు...

Sunday, May 14, 2017 - 07:04

ఖమ్మం : నేలకొండపల్లిలో స్వైన్‌ ఫ్లూతో ఓ వృద్ధుడు కన్నుమూశాడు.. కిలాడు నాగభూషణం అనే వ్యక్తి 20రోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు.. స్థానిక ఆస్పత్రిలో చూపించినా ఫలితంలేకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.. అక్కడ వ్యాధినిర్ధారణ పరీక్షలు చేసిన వైద్యులు స్వైన్‌ ఫ్లూగా తేల్చారు.. చికిత్స అందించినప్పటికీ నాగభూషణం కోలుకోలేదు.. స్వైన్‌...

Saturday, May 13, 2017 - 17:48

ఖమ్మం : టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి. మంత్రి హరీశ్‌ రావు ఐదున్నర లక్షలకు ఐస్‌ క్రీం అమ్ముతారని... రైతులకు పదివేల రూపాయల మద్దతు ధరమాత్రం ఇవ్వలేరని విమర్శించారు. ప్లీనరీ పేరు మీద వెయ్యికోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. రైతులకు మద్దతుధర ఇచ్చి పంట కొనలేని సన్నాసి సీఎం కేసీఆర్ అని తీవ్రస్థాయిలో విమర్శలు...

Saturday, May 13, 2017 - 15:47

ఖమ్మం : ఈ అమ్మాయి పేరు సుమలత. పుట్టింది పేద కుటుంబంలోనైనా.. పేదరికం తన చదువుకు అడ్డం కాదని నిరూపించింది. డబ్బు, హోదా, అవకాశాలు అన్నీ ఉండీ చదవలేని వారికి ఈ చదువుల తల్లి రోల్‌మోడల్‌గా నిలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన మణి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉంటోంది. కూలీ పనులు చేస్తూ ఇద్దరు కూతుళ్లను చదివించింది. పెద్ద కూతురు సుమలత చదువులో ఎంతో రాణిస్తోంది. సుమలత 8 వ తరగతి వరకూ.. టేకుల...

Pages

Don't Miss