కడప
Thursday, July 27, 2017 - 15:30

కడప : బాలలను పనిలో పెట్టుకోవడం నేరమని తెలిసినా పలువురు వ్యాపారస్తులు బాలలను పనిలో పెట్టుకుని వారిచేత వెట్టిచాకిరి చేయిస్తున్నారు. పోలీసులు జరుపుతున్న దాడుల్లో ఈ ఉదంతం వెలుగు చూస్తోంది.
వివిధ షాపుల్లో పనిచేస్తున్న 71 మంది బాల కార్మికులకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించారు. పోలీసులు, కార్మిక శాఖ అధికారులు షాపులపై దాడులు నిర్వహించి, వీటిలో పని చేస్తున్న బాల కార్మికులను...

Wednesday, July 26, 2017 - 18:35

విజయవాడ : ముద్రగడ పద్మనాభం గృహనిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ఏపీలో నిరసనలు వెల్లువెత్తాయి. సమాచారం తెలిసిన వెంటనే కాపులు ఎక్కడికక్కడ రోడ్ల మీదకు వచ్చారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన కారులను పలు చోట్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా చాలా ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. కాపు రిజర్వేషన్ల కోసం పాదయాత్ర తలపెట్టిన ముద్రగడ పద్మనాభంను పోలీసులు...

Tuesday, July 25, 2017 - 08:03

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో... విద్యార్థులు కదం తొక్కారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ కర్నూలులో విద్యార్థులు కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, పోలీసులకు తొపులాట చోటు చేసుకుంది. అలాగే కడపలోని కలెక్టరేట్‌ను విద్యార్థులు ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పోలీసులు అడ్డుకుని.....

Sunday, July 23, 2017 - 20:34

కడప : జిల్లాలో ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జారాయుళ్లు ఆక్రమించేస్తున్నారు.  నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విలువైన భూములను కాజేస్తున్నారు. వాటిని రక్షించాల్సిన రెవెన్యూ అధికారులు కాసుల కక్కుర్తితో అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. కడప జిల్లా కాశినాయన మండలంలో కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూములపై 10టీవీ ప్రత్యేక కథనం...
...

Sunday, July 23, 2017 - 09:56

కడప : జిల్లాలోని గుడ్ హార్ట్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో జిల్లా జడ్జి శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వృద్ధులను చిత్ర హింసలకు గురిచేస్తూ, భోజనం సరిగా పెట్టడం లేదని అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో అర్ధరాత్రి వృద్ధ ఆశ్రమాన్ని తనిఖీ చేశారు. వృద్దులు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసి జడ్జి శ్రీనివాసులు చలించిపోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులను హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి...

Friday, July 21, 2017 - 21:56

కడప : జిల్లాలో దారుణం జరిగింది. ప్రొద్దుటూరు గోకుల్‌నగర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని హైందవను దుండగులు గొంతుకోసి చంపారు. హైందవ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతో పాటు స్కూటీతో దుండగులు పరారయ్యారు. అయితే... బంగారం కోసమే హత్య చేశారా ? లేక ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు. అయితే... ఇటీవలే హైదరాబాద్‌ నుంచి సొంత ఊరు వచ్చిన హైందవ...

Tuesday, July 18, 2017 - 21:39

విశాఖ : ఆంధ్రప్రదేశ్‌ను భారీవర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరదభయం వెంటాడుతోంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో రాగల 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని విశాఖ వాతారణ కేంద్రం తెలిపింది.
48 గంటల్లో..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఏపీలో భారీ...

Tuesday, July 18, 2017 - 20:39

కడప : మన దేశంలో తల్లి, తండ్రి, గురువును దైవంతో సమానంగా చూస్తాం. ముఖ్యంగా తల్లిదండ్రుల తరువాత ఆ స్థానాన్ని, అంతటి గౌరవాన్ని గురువుకు ఇస్తాము. అంతటి పవిత్రమైన స్థానంలో ఉన్న ఓ గురువు వెర్రి వేషాలు వేశాడు. పసి పిల్లలకు తప్పుడు పాఠాలు చెప్పాడు. కడప జిల్లాలో అసభ్య టీచర్‌ భాగోతంపై 10 టీవీ కథనం. 
బూతులు జొప్పిస్తూ..
ఇదిగో ఈ ప్రబుద్ధుడిని చూడండి. ఇతని పేరు...

Monday, July 17, 2017 - 21:23

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభాంతో ఏపీ తెలంగాణలో పలు చోట్ల భారీవర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో భారీవర్షాలు దంచికొడుతుండగా .. ఒడిశాలో కురుస్తున్న భారీవర్షాలకు ఉత్తరాంధ్రలోని నదుల్లో వరద ఉధృతి...

Sunday, July 16, 2017 - 12:58

కడప : జిల్లాలోని రాజంపేట మండలం ఉప్పరపల్లెలోని రైల్వేట్రాక్‌పై యువతీ, యువకుల మృతదేహాలు కలకలం సృష్టించాయి.. డ్రైవింగ్‌ లైసెన్స్ఆధారంగా చనిపోయిన యువకుడు రాజోలు నాగార్జున రెడ్డిగా గుర్తించారు.. వారిదగ్గరున్న బ్యాగ్‌లో బంగారు తాళిబొట్టు, రెండువేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఇద్దరూ ఆత్మహత్య చేసుకొనిఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

 

Pages

Don't Miss